గుడివాడ ( జనస్వరం ) : కృష్ణాజిల్లా గుడివాడ పట్టణ స్థానిక బేతవోలు శాంతి వృద్ధాశ్రమంలో వృద్ధులకు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటుచేసి వారికి ఉచితంగా మందులు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా గుడివాడ పట్టణ జనసేన నాయకులు డాక్టర్ మాచర్ల రామకృష్ణ(Rk) మాట్లాడుతూ మానవసేవయే మాధవసేవ అనే నినాదంతో పవన్ కళ్యాణ్ గారు స్ఫూర్తితో మేము చేస్తున్న సేవా కార్యక్రమాలు భాగంగా ఆశ్రమంలో ఉన్న తల్లులకు వర్షాకాలం రావడంతో వారు అనారోగ్యంతో ఇబ్బంది పడడంతో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసి వారికి ఉచితంగా మందులు అందజేయడం జరిగిందని తెలియజేసినారు అదే విధంగా మేము చెప్పిన వెంటనే స్పందించి ఈ తల్లులకి వైద్యం అందజేసిన డాక్టర్ కోలా వెంకటేశ్వరరావు గారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు అని చివరి దశలో ఏ తోడు లేక ఒంటరిగా ఉంటున్న వృద్ధమాతలకు మా ఆర్కే వారియర్స్ ఎప్పుడు తోడుంటామాని తెలియజేయడం జరిగింది.. ఈ కార్యక్రమంలో గుడివాడ పట్టణ జనసేన పార్టీ ముస్లిం మైనారిటీ నాయకులు షేక్ మీరా షరీఫ్ గారు,నూనె అయ్యప్ప, దివిలి సురేష్, గంట అంజి, చరణ్ తేజ్, పందిళ్ళ శీను, మరియు జన సైనికులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com