అత్తిలి ( జనస్వరం ) : అత్తిలి జనసేన ఆధ్వర్యంలో విజయవాడ ప్రముఖ వైద్యులు డా. వై.వి.రావు గారి హాస్పిటల్ వారిచే ఉచిత గుండె వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. డా. బోయపాటి శ్రీనివాసరావు గారు పరీక్షలు నిర్వహించి హృద్రోగులకు తగు సూచనలు చేశారు. కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న దృష్ట్యా తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. ప్రజాసేవే లక్ష్యంగా జనసైనికులు నిస్వార్థంగా నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని గ్రామ పెద్దలు, ప్రజలు అభినందనలు వ్యక్తం చేశారు. జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి కూసంపూడి శ్రీనివాస్ శిబిరాన్ని సందర్శించారు. ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా కార్యదర్శి శ్రీ అన్నెం విశ్వప్రభు, మహిళా కోఆర్డినేటర్ శ్రీమతి కాట్నం విశాలి, నియోజకవర్గ నాయకులు శ్రీమతి పుప్పాల కుమారి, అనుకుల రమేష్, బడేటి కృష్ణ, బడేటి త్రినాధ్, తానంకి అయ్యప్ప, రామ్ ప్రసాద్, గణేష్, శ్రీరామ్, మాధవరావు నాయుడు తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com