అనంతపురం ( జనస్వరం ) : అనంతపురం జిల్లాలో కరువు కాటకాలకు నిలయమై, యువత ఉద్యోగాలు లేక పక్క రాష్ట్రాలకు వలస వెళ్తున్నారు. యువతకు దిశా నిర్దేశం చేసే ప్రభుత్వ స్పందన అంతంత మాత్రమే. ఈ విషయాన్ని గమనించిన ముక్కోటి అంబిక సేవా చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కోల్లా శివయ్య ( శింగనమల నియోజకవర్గం జనసేన నాయకులు) యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలనుకున్నారు. అందుకు అన్వేషణ మొదలుపెట్టారు. యువతకు ట్రైనింగ్ ఇచ్చి, ఇక్కడే ఉద్యోగావకాశాలు కల్పించాలని ధృడ సంకల్పించుకున్నారు. కియా కార్ల కంపెనీలో కొరియన్ ట్రాన్సలేటర్స్ కొరత ఉందని గ్రహించారు. ఆ రంగంలో యువతకు అవకాశాలు కల్పించాలని, తద్వారా వలసలు ఆపాలని కంకణం కట్టుకున్నారు. అందులో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి జన్మదినం సందర్భంగా, నాదెండ్ల మనోహర్ గారి సూచనలు మేరకు బడుగు బలహీన వర్గాల విద్యార్థిని, విద్యార్థులకు ఉచితంగా ఫారెన్ లాంగ్వేజ్ (కొరియన్, జపనీస్, స్పానిస్) ఇనిస్టిట్యూట్ ప్రారంభించారు. ఈ కోర్సుల యందు ముందుగా 45 రోజులు బేసిక్ లెవల్ ట్రైనింగ్ అందించడం జరుగుతుంది. ఇందులో 60% ఉత్తీర్ణత సాధించిన వారికి అడ్వాన్స్ 6 నెలల కోర్సు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. 6 నెలల కోచింగ్ అనంతరం వీరికి ట్రస్ట్ సర్టిఫికేట్ అందిస్తూ, ట్రస్ట్ తరుపున ఉద్యోగావకాశాలు కల్పించడం జరుగుతుంది. (MNC companies, NGO'S మరియు ఫారిన్ దేశాల యందు లాంగ్వేజ్ ట్రాన్సల్టేర్స్ గా ఉద్యోగాలు కలిపించడం జరుగుతుంది). ఇందులో సెలెక్ట్ అయిన వారికి 60 వేల నుండి 1.50 లక్షల వరకూ జీతం ఉంటుందని ట్రస్ట్ వారు తెలియజేస్తున్నారు. ఈ కోర్సుల యందు ఆసక్తి ఉన్న వారు ట్రస్ట్ కో - ఆర్డినేటర్ రామాంజినేయులు ( 73968 88825 ) ను సంప్రదించండి. అక్టోబర్ 2 నుండి కొత్త బ్యాచ్ ప్రారంభం అవుతుంది.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com