Logo
Date of Publish : 15 April 2021, 6:50 am
Editor : Sake Naresh

విశాఖ పశ్చిమ జనసేన నాయకులు పీలా రామకృష్ణ సహాకారంతో ఉచిత కంటి వైద్యం మరియు ఉచిత ఆపరేషన్లు

             డాక్టర్ బి. అర్. అంబేద్కర్ గారి 130వ జయంతి సందర్భంగా విశాఖ పశ్చిమ నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు శ్రీ పీలా రామకృష్ణ గారి ఆధ్వర్యంలో కిమ్స్ ఐకాన్ హాస్పిటల్స్ సహకారంతో ఉచిత కంటి వైద్యం మరియు ఉచిత ఆపరేషన్లు నిర్వహించారు. సుమారు 200 మంది వచ్చి కంటి పరీక్షలు నిర్వహించుకున్నారు అందులో 28 మందికి ఆపరేషన్స్ చెయ్యాల్సి ఉండగా హాస్పిటల్ కి తీసుకు వెళ్లడం జరిగింది. జనసేన నాయకులు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అంబేద్కర్ గారి జన్మదిన సందర్భంగా విశాఖ ప్రజలకు ఉచిత కంటి  వైద్యం మరియు ఆపరేషన్లు నిర్వహించడం గొప్ప సంకల్పం అని అన్నారు. ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కోరారు. జనసేన పార్టీ గెలిచినా, ఓడినా ప్రజలకు అండగా ఉంటుందని అన్నారు. రాష్ట్రంలో ఎవరికి ఏం కష్టం వచ్చినా అండగా ఉండేది ఒక్క జనసేన పార్టీ మాత్రమే అని అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు శ్రీ తమ్మిరెడ్డి శివశంకర్ గారు, బొలిశెట్టి సత్య గారు, బొడ్డేపల్లి రఘు గారు, సతీష్ గారు, జనసేన కార్పొరేటర్ అభ్యర్థులు మోజ్జాడ చంద్రమౌళి గారు, కంఠం రెడ్డి శివశంకర్ గారు, దుంగా దేవేన్ రాజు గారు, జనసేన నాయకులు గుంటూరు నరసింహమూర్తి, నర్సింహా రెడ్డి, కంఠం రెడ్డి మనోజ్, బీజేపీ కార్పొరేటర్ అభ్యర్థి ములకలపల్లి ప్రకాష్ గారు, సిరసపల్లి నూకరాజు, ఈ పి ఎస్ భాగ్య లక్ష్మి గారు, జనసైనికులు పవన్ ఆనంద్, శిశిర్ రెడ్డి పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com