ఆత్మకూరు, (జనస్వరం) : ఆత్మకూరు జనసేనపార్టీ ఆధ్వర్యంలో చేజర్ల మండలంలోని నడిగడ్డ అగ్రహారంలో ఆత్మకూరు జనసేన పార్టీ ఇంచార్జ్ నలిశెట్టి శ్రీధర్ సహకారంతో స్వర్ణ భారత్ ట్రస్ట్ సౌజన్యంతో, చేజర్ల మండల ఇంచార్జ్ బండి అనిల్ రాయల్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా నలిసెట్టి శ్రీధర్ మాట్లాడుతూ నడిగడ్డ అగ్రహారంలో ఉచిత కంటి వైద్య శిబిరం చేపట్టడం జరిగింది. అదేవిధంగా కంటి ఆపరేషన్లు అవసరమైన వాళ్లకు జనసేన పార్టీ సొంత ఖర్చులతో ఉచిత కంటి ఆపరేషన్లు చేసే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టడం జరిగింది. అదేవిధంగా ఆత్మకూరు నియోజవర్గంలో ఏ గ్రామంలో అయినా కంటి సమస్యలతో బాధపడుతుంటే వాళ్లకి జనసేనపార్టీ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేశారు, ఈ కార్యక్రమంలో ఆత్మకూరు జనసేన పార్టీ ఉపాధ్యక్షులు నాగరాజ్ యాదవ్, జనసేన నాయకులు హరీష్, హరిబాబు, చైతన్య, ఆదర్శ్, రెహమద్, విజయ్ తదితరులు పాల్గొన్నారు.