
రాజోలు ( జనస్వరం ) : మెరకపాలెం జనసేనపార్టీ అధ్యక్షులు గిడుగు సత్య బ్రహ్మాజీ, గిడుగు జయజ్యోతి పెళ్లిరోజు సందర్బంగా వారు ఉచిత త్రాగునీటి సరఫరా అందించారు. ట్రాక్టర్, డీజల్ మరియు డ్రైవర్ జీతం ధన సహయంతో జనసేనపార్టీ చిరుపవన్ సేవాసమితి ఉచిత వాటర్ ట్యాంకర్ ద్వారా ఉచిత త్రాగు నీరు అందించారు. గోంది_దుర్గమ్మగుడి ప్రాంత ప్రజలకు త్రాగునీరు లేక ఇబ్బంది పడుతున్న వారికీ జనసేనపార్టీ ఆద్వర్యంలో ఉచిత త్రాగునీరు సరఫరా చేయడం జరిగింది.