Logo
Date of Publish : 18 September 2023, 12:51 am
Editor : Sake Naresh

ఉచిత మట్టి వినాయక ప్రతిమలు అందజేసిన గుడివాడ పట్టణ జన సైనికులు

    గుడివాడ ( జనస్వరం ) : పట్టణ స్థానిక బస్టాండ్ సెంటర్లో జనసైనికులు ఆధ్వర్యంలో ప్రజలకు ఉచిత మట్టి వినాయక ప్రతిమలు హిందూ ముస్లిం క్రిస్టియన్ వారి చేతుల మీదగా అందజేసి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా గుడివాడ పట్టణ జనసేన నాయకులు డాక్టర్ మాచర్ల రామకృష్ణ మాట్లాడుతూ గుడివాడ పట్టణ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాని సమాజమే దేవాలయంగా భావిస్తూ సమాజ హితమే నా అభిమతం గా మార్చుకుని గుడివాడ పట్నంలో అనేక సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళుతున్న మా టీముని గుడివాడ పట్టణ ప్రజలు ఆశీర్వదించాలని మనస్పూర్తిగా కోరారు అదేవిధంగా వినాయక చవితి అంటేనే పెద్ద పెద్ద ప్లాస్టిక్ పారిస్ విగ్రహాలతో పూజలు చేసి నీటిలో వదిలి వేయడం వల్ల నీరు కలుషితమై ఆ నీరు తాగడం వల్ల అనేక అనారోగ్యాలు వస్తున్నాయని దయచేసి ప్లాస్టిక్ పారిస్ వద్దు మట్టి వినాయక ప్రతిమలు ముద్దు అనే నినాదంతో గుడివాడ పట్టణంలో ఉన్న ప్రజలకు ఉచితంగా మట్టి వినాయక ప్రతిమాలను అందజేయడం జరిగిందని తెలియజేశారు. అదేవిధంగా జనసేన పార్టీ సిద్ధాంతంలో కుల మతాల రహితంగా ఉండాలని మా నాయకుడు ఆలోచన ఈరోజు హిందూ సాంప్రదమైన వినాయక చవితి పండుగను సర్వ మతాలతో అందజేసి కులమత వర్గాలు లేకుండా అందరూ కలిసిమెలిసి ఉండాలని నా ఆకాంక్షాన్ని తెలియజేశారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ముస్లిం మైనారిటీ నాయకులు షేక్ మీరా షరీఫ్ గారికి ఆర్కే వారియర్స్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు నూనె అయ్యప్ప కిరణ్ మట్ట జగదీష్ శివ చరణ్ తేజ్ చరణ్ అరుణ కంచనపల్లి సుబ్రహ్మణ్యం గారు మరియు జన సైనికులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com