గుంటూరు ( జనస్వరం ) : ఒక్క చాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఎవరూ ఊహించనంత అరాచక పాలనతో నవ్యాంధ్రప్రదేశ్ ని సర్వనాశనం చేశారని జనసేన పార్టీ గుంటూరు జిల్లా అధికార ప్రతినిధి ఆళ్ళ హరి విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పడి నేటితో నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా శ్రీనివాసరావుతోటలోని గాజు గ్లాస్ దిమ్మె వద్ద నవ్యాంధ్ర నాశనానికి నాలుగేళ్లు గోడప్రతులను జనసైనికులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆళ్ళ హరి మాట్లాడుతూ ఒక నియంత పాలనలో రాష్ట్రం నలభై ఏళ్లు వెనక్కి వెళ్లిందని విమర్శించారు. ఎన్నికలకు ముందు వైసీపీ నేతలు చెప్పిన మాయమాటల వెనుక ఇంత అరాచకత్వం ఉంటుందని ప్రజలు ఊహించలేకపోయారన్నారు. జగన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన మరుక్షణం వైసీపీ నేతల అసలు రూపాలు బయటికి వచ్చి రాష్ట్రాన్ని విధ్వంసం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజావేధికను కూల్చటంతో మొదలైన వైసీపీ దాష్టీకాలు భూ కబ్జాలతో, దందాలతో, హత్యాలతో, అత్యాచారాలతో కొనసాగుతున్నాయని ధ్వజమెత్తారు. మధ్యాన్ని నిషేధించకపోగా సొంత నకిలీ మద్యాన్ని పేద ప్రజలతో తాగిస్తూ వారిని జీవచ్చవాలుగా మారుస్తున్నారని దుయ్యబట్టారు. మద్యంతో కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయని ఎన్నికలకు ముందు మొసలి కన్నీరు కార్చిన ముఖ్యమంత్రి ఇప్పుడు కొన్ని కోట్ల కుటుంబాలలో కన్నీళ్ల విషాదాన్ని నింపుతున్నారని మండిపడ్డారు. వైసీపీ అసమర్ధ పాలనలో కార్మికుల, రోజువారీ కూలీల, ఉద్యోగుల, నిరుద్యోగుల, వ్యాపారుల జీవితాలు నరకకూపంగా మారాయని విమర్శించారు. మరోవైపు పెంచిన చార్జీలు, ఇష్టానుసారంగా వేసిన పన్నులు పేద ప్రజల వెన్ను విరుస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఒక్క రోడ్డు కూడా కొత్తది నిర్మించలేదు. ప్రజలకు క్షేత్రస్థాయిలో మౌలిక సదుపాయాలు అందించటంలేదు. మరి సంక్షేమం పేరుతో చేస్తున్న లక్షల కోట్ల రూపాయలు ఎవరి జేబుల్లోకి వెళ్తున్నాయని ప్రశ్నించారు. ప్రజలు ఓటు వేసేముందు ఎలాంటి వ్యక్తులకు వేస్తున్నాం అని ఒక్కక్షణం ఆలోచించాలని కోరారు. సమాజం పట్ల బాధ్యత, ప్రేమ, దేశం పట్ల అచంచల భక్తి ఉన్న పవన్ కల్యాణ్ లాంటి వారిని అసెంబ్లీకి పంపించాలని ప్రజల్ని కోరారు. వైసీపీ అరాచకత్వంతో విద్వంసమైన రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాలంటే పవన్ కళ్యాణ్ నాయకత్వం రాష్ట్రానికి అవసరమని ఆళ్ళ హరి అన్నారు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు సయ్యద్ షర్ఫుద్దీన్, నగర కమిటీ నాయకులు బండారు రవీంద్ర, మహమ్మద్ బాషా, బందెల నవీన్, రెల్లి యువత నాయకులు సోమి ఉదయ్ కుమార్, నండూరి స్వామి, వడ్డె సుబ్బారావు, పీ రమేష్, దాసరి రాము, మహేష్, కుమార స్వామి, ఇల్లా చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.