Logo
Date of Publish : 06 July 2026, 5:18 pm
Editor : Sake Naresh

మనం ఫౌండేషన్ 10 వ వార్షికోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా డాక్టర్ జె వి ఎస్ భాస్కర్

మనం ఫౌండేషన్ 10వ వార్షికోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా డా. జేవీఎస్ భాస్కర్

హైదరాబాద్,జూలై06( జనస్వరం)

మనం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 11వ తేదీన నిర్వహించనున్న 10వ వార్షికోత్సవ వేడుకలు –2026కు ఇన్‌స్పైర్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు, సీఈఓ, గ్లోబల్ అవార్డు గ్రహీత, జోష్ టాక్స్ మరియు టెడ్‌ఎక్స్ స్పీకర్ డా. జేవీఎస్ భాస్కర్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.హైదరాబాద్‌ లోని చిక్కడపల్లి శ్రీ త్యాగరాయ గానసభ కళా దీక్షితులు హాల్‌లో సాయంత్రం 5 గంటల నుంచి ఈ వేడుకలు ఘనంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు అవార్డుల ప్రదానోత్సవాన్ని నిర్వహించనున్నారు. యువత సాధికారత, నాయకత్వ వికాసం, సామాజిక సేవా రంగాల్లో చేస్తున్న సేవలను గుర్తిస్తూ డా. జేవీఎస్ భాస్కర్‌ను ఈ ప్రతిష్ఠాత్మక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆహ్వానించారు.మనం ఫౌండేషన్ వ్యవస్థాపకులు, చైర్మన్, న్యాయవాది డా. కె. చక్రవర్తి ఆహ్వానం మేరకు డా. జేవీఎస్ భాస్కర్ ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.ఈ సందర్భంగా డా. జేవీఎస్ భాస్కర్ మాట్లాడుతూ, “పదేళ్ల సేవా ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంటున్న మనం ఫౌండేషన్‌కు హృదయపూర్వక అభినందనలు.ఈ ప్రతిష్ఠాత్మక వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొనడం ఆనందంగా భావిస్తున్నాను అని తెలిపారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com