Logo
Date of Publish : 06 July 2026, 11:52 am
Editor : Sake Naresh

సూపర్ స్టార్ కృష్ణ విగ్రహ ప్రతిష్ఠ శంకుస్థాపన కార్యక్రమం

నెల్లూరు, జూలై 5 (జనస్వరం): నెల్లూరు నగరంలోని మినీ బైపాస్ అనిల్ గార్డెన్ జంక్షన్ వద్ద ఉన్న స్వామి వివేకానంద విగ్రహం సమీపంలో సినీ నటుడు సూపర్ స్టార్ ఘట్టమనేని కృష్ణ విగ్రహ ప్రతిష్ఠకు హీరో కృష్ణ, హీరో మహేష్ బాబు అభిమానులు ఆదివారం శంకుస్థాపన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, జనసేన పార్టీ సీనియర్ నాయకుడు ప్రవీణ్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ప్రసాద్, మహేష్, సిరాజ్‌లు ముఖ్య అతిథులను శాలువాలతో సత్కరించి, పుష్పగుచ్ఛాలు అందజేసి ఘన స్వాగతం పలికారు. అనంతరం సూపర్ స్టార్ కృష్ణ విగ్రహ ప్రతిష్ఠకు కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన కార్యక్రమాన్ని కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల్లూరులో సూపర్ స్టార్ కృష్ణ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని పేర్కొంటూ, కృష్ణ, మహేష్ బాబు అభిమానులను అభినందించారు. విగ్రహ ప్రతిష్ఠకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం ప్రవీణ్ రెడ్డి మాట్లాడుతూ, నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావు వంటి మహానటుల సరసన తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని సినీ పరిశ్రమలో తారాస్థాయికి ఎదిగిన మహానటుడు సూపర్ స్టార్ కృష్ణ అని కొనియాడారు. ఆయన విగ్రహాన్ని నెల్లూరులో ఏర్పాటు చేసేందుకు కృష్ణ, మహేష్ బాబు అభిమానులు చేస్తున్న ప్రయత్నాన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రసాద్, మహేష్, సిరాజ్, రాము, మెంటా సత్యనారాయణతో పాటు హీరో కృష్ణ, హీరో మహేష్ బాబు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com