Logo
Date of Publish : 02 March 2026, 9:18 pm
Editor : Sake Naresh

పాఠశాల అభివృద్ధికి పూర్వ విద్యార్థి ఎస్. షాహిల్ భాష విరాళం

శెట్టూరు (మాకొడికి), ఫిబ్రవరి 24, (జనస్వరం) : తమకు విద్యాబుద్ధులు నేర్పిన పాఠశాల అభివృద్ధికి చేయూతనందించాలనే ఉద్దేశంతో ఓ పూర్వ విద్యార్థి ముందుకు వచ్చాడు. మాకొడికి ఉన్నత పాఠశాలకు చెందిన 2016–17 బ్యాచ్ విద్యార్థి ఎస్. షాహిల్ భాష పాఠశాల అభివృద్ధి పనుల కోసం రూ.10,000 నగదును విరాళంగా అందజేశారు. ఈ మొత్తాన్ని ఉపాధ్యాయుల సమక్షంలో ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులకు అందించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ తాము చదువుకున్న పాఠశాలపై మమకారంతో సహాయం అందించడం అభినందనీయమన్నారు. షాహిల్ భాష వంటి పూర్వ విద్యార్థులు ఇతరులకు స్ఫూర్తిగా నిలవాలని ఆశాభావం వ్యక్తం చేశారు. పాఠశాల అభివృద్ధికి అందించిన సహాయానికి ఉపాధ్యాయ బృందం ఆయనకు కృతజ్ఞతలు తెలిపింది.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com