Logo
Date of Publish : 15 September 2020, 12:33 pm
Editor : Sake Naresh

మాజీ ఎంపీ హర్షకుమార్ ఏళ్ల తరబడి దళిత జాతిని మోసం చేస్తున్నారని జనసేన నాయకుల తీవ్ర విమర్శలు

మాజీ ఎంపీ హర్షకుమార్ ఏళ్ల తరబడి దళిత జాతిని మోసం చేస్తున్నారని జనసేన నాయకుల తీవ్ర విమర్శలు

                     పదవుల కోసం, అధికారం కోసం దళిత జాతిని వాడుకుంటూ మాజీ ఎంపీ హర్షకుమార్ ఏళ్ల తరబడి దళిత జాతిని మోసం చేస్తున్నారని జనసేన పార్టీ ఎస్సీ విభాగం నేతలు తీవ్ర విమర్శలు చేశారు. జనసేన పార్టీ పైన, పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పైన అర్థరహితమైన, నిరాధారమైన ఆరోపణలు చేయడం ద్వారా హర్ష కుమార్ తన నైజాన్ని మరోసారి బయట పెట్టుకున్నాడని వారు దుయ్యబట్టారు. ముమ్మిడివరం జనసేన పార్టీ కార్యాలయంలో మంగళవారం పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు హర్షకుమార్ తీరును తీవ్రంగా తప్పుపట్టారు. పదేళ్లపాటు అమలాపురం ఎంపీ గా అధికారాన్ని చెలాయించిన హర్ష కుమార్ అటు దళితులకు గాని, ఇటు ప్రజలకు గానీ చేసిందేమీ లేదని వారు విమర్శించారు. అంతర్వేది ఘటన పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హిందువుల యొక్క మనోభావాలు దెబ్బ తినకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని దోషుల్ని శిక్షించాలని డిమాండ్ చేశారు అన్నారు. ఈ ఘటనను కొంతమంది రాజకీయ లబ్ది కోసం వాడుకుంటున్నారని మతాలను, కులాల్ని రెచ్చగొట్టే విధంగా మాజీ ఎంపీ హర్షకుమార్ వ్యాఖ్యానించడంసరికాదని ముమ్మిడివరం నియోజకవర్గ జనసేన ఎస్సీ సెల్ విభాగం నాయకుడు తాళ్లూరి ప్రసాద్ ఆరోపించారు. మాజీ ఎంపీ హర్షకుమార్ ఇప్పుడు తన రాజకీయ మనుగడ కోసమే జనసేన వంటి పార్టీ కి కులాన్ని ఆపాదించడం దారుణమన్నారు. జనసేన పార్టీ పై హర్ష కుమార్ చేసిన వ్యాఖ్యల్ని బేషరతుగా వెనక్కి తీసుకోవాలని ముమ్మిడివరం నియోజకవర్గ జనసేన పార్టీ ఎస్సీ సెల్ విభాగం డిమాండ్ చేసింది. పదేళ్లు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న హర్ష కుమార్ హయాంలో కోనసీమలో కుల ఘర్షణలు జరగడానికి ఆయన వైఖరే కారణమని జనసేన నాయకులు ఆరోపించారు. కోనసీమలో అనేకమంది ఎస్సీ యువకులపై కేసులు అయితే ఐదేళ్ళ పాటు కోర్టుల చుట్టూ తిరిగి నప్పటికీ వారిని ఆర్థికంగా ఆదుకున్న దాఖలాలు లేవని జనసేన ఎస్సీ సెల్ ప్రతినిధులు ఆరోపించారు. నీకంటే ముందు స్వర్గీయ  కె ఎస్ ఆర్ మూర్తి, స్వర్గీయ జి.ఎం.సి.బాలయోగిలు ఎంపీలుగా చేసినప్పుడు ఎటువంటి కుల వివక్షతను చూపించలేదని ఇకనైనా మీరు ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు ద్వారా పార్టీ నాయకులు కుల సంఘాల, ప్రజల యొక్క మనోభావాలను కించపరచకుండా ఉండాలని లేకుంటే జనసేన ఎస్సీ సెల్ విభాగం చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ సెల్ విభాగం నాయకులు తాళ్లూరి ప్రసాద్, మచ్చా నాగబాబు, ఎలమంచిలి బాలరాజు, ఓగూరి భాగ్యశ్రీ, మోకా బాల ప్రసాద్, జయరాజు, గిడ్డి రత్నశ్రీ తదితరులు పాల్గొని హర్షకుమార్ తీరును ఎండగట్టారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com