పరవాడ ( జనస్వరం ) : ఈనెల 20వ తారీఖున జనసేన పార్టీలో చేరిన మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబును పరవాడ మండలం పరవాడ వెన్నెల పాలెం తానం గ్రామాలకు చెందిన జనసైనికులు పెందుర్తి జనసేన నాయకురాలు సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రమేష్ బాబు మాట్లాడుతూ జనసేన పార్టీలో తాను చేరినప్పటి నుండి పెందుర్తి నియోజకవర్గం లోని ప్రతి గ్రామం నుండి జనసైనికులు వందలాదిగా వచ్చి తనను కలవడం చూస్తుంటే వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రావడం ఖాయం అనిపిస్తుందని అన్నారు. తాను జనసేన పార్టీలో చేరిన రోజు నుండి ఒక జన సైనికుడిగా మారిపోయానని భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రి చేయడానికి ప్రతి జన సైనికుడు వీర మహిళా శక్తివంచన లేకుండా కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం గొన్న రమాదేవి మాట్లాడుతూ గ్రామ గ్రామాన జనసేన కార్యకర్తలు ఉన్నప్పటికీ ఇప్పటివరకు వారిని నడిపించే నాయకుడు లేక అయోమయ స్థితిలో ఉండిపోయారని ఇప్పుడు పంచకర్ల రమేష్ బాబు చేరికతో జనసేన పార్టీ శ్రేణులలో ఒక కొత్త ఉత్సాహం వచ్చిందని అన్నారు ఈ సందర్భంగా జనసైనికులను ఆయనకు పరిచయం చేశారు
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com