- కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్
చిత్తూరు, (జనస్వరం) : ఉమ్మడి చిత్తూరు జిల్లాలో జనసేన పార్టీ బలపడుతోంది. శుక్రవారం కాణిపాకం ఆలయ ట్రస్ట్ బోర్డు మాజీ ఛైర్మన్ రాజకుమార్ జనసేనలో చేరారు. తిరుపతిలోని ఆ పార్టీ పిఎసి కార్యాలయంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా పార్టీ అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ మాట్లాడుతూ జనసేన పార్టీ సిద్దాంతాలు, పవన్ కల్యాణ్ ఆలోచనలకు ఆకర్షితులై అనేక మంది పార్టీలో చేరుతున్నారన్నారు. కాణిపాకం శ్రీవరసిద్ది వినాయక స్వామివారి దేవస్థానం మాజీ ధర్మకర్తల మండలి ఛైర్మన్ రాజకుమార్ పార్టీలో చేరడం శుభ పరిణామమన్నారు. పార్టీ సిద్దాంతాలను క్షేత్రస్థాయిలోకి తీసుకువెళ్లి పార్టీని మరింత బలోపేతం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు జిల్లా కార్యదర్శి భాను ప్రసాద్, బాటసారి, తిరుపతి నగర ఉపాధ్యక్షులు పార్ధు, తిరుపతి నగర కార్యదర్శి కిరణ్ కుమార్, మనోజ్ కుమార్, గౌస్ భాష, మోహిత్, ఇంద్ర మరియు తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com