Logo
Date of Publish : 21 November 2022, 5:25 pm
Editor : Sake Naresh

గాజువాకలో భారత్ జనసైనిక్స్ టీం ఏర్పాటు

గాజువాక ( జనస్వరం ) : గాజువాక నియోజకవర్గం యారాడలో " భారత్ జనసైనిక్స్ " పేరును ఆవిష్కరించడం జరిగింది. గాజువాక జనసైనికులు ఒక టీం గా ఏర్పడి అన్ని వార్డు కార్యకర్తలను కలుపుకుంటూ జనసేన పార్టీ గెలుపు కోసం గాజువాకలో జనసేన జెండా ఎగురవేయడమే లక్ష్యంగా పనిచేయడం కోసం, ఇంటింటి ప్రచారం, ప్రజా సమస్యలు సేకరించడం, గాజు గ్లాసు గుర్తు జనాల్లోకి తీసుకెళ్ళడం, పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న సహాయాన్ని ప్రజలకు వివరించడం, పార్టీ సిద్ధాంతాలను ఆశయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి, మరియు ఓటు కోసం విజ్ఞప్తి చేయడం ద్వారాను ముందుకు నడవాలని ఒక ఏకాభిప్రాయంతో ఈ టీం ఏర్పాటు చేయడం జరిగింది. టీం సభ్యులు మాట్లాడుతూ  భారత్ జనసైనిక్స్ టీం ఏ ఒక్కరి సొత్తు కాదు. ఇది జనసైనికులది. ఇందులో నాయకులు వుండరు. ఏ ఒక్కరూ దిశానిర్దేశం చేసే అవకాశం ఈ టీం ఇవ్వదు. వాట్సాప్ యుద్ధాలకు ప్రాధాన్యం ఇవ్వదు. పనిచేయాలనే తపన ఉన్నవారు ఈ టీం ద్వారా తమ ఆశయం ఆలోచనలు నెరవేర్చుకునే వేదిక ఈ భారత్ జనసైనిక్స్ టీం. గ్రౌండ్ వర్క్ లో నిత్యం ఉంటుంది. జనసేన పార్టీ పెద్దలను చిన్నలను గౌరవిస్తూ వార్డు కార్పొరేటర్ అభ్యర్థుల సహకారంతో పనిచేస్తుంది. ఈ టీం నిజమైన జనసేన కార్యకర్తలకు స్వాగతిస్తుంది. కొన్ని కొన్ని ఖచ్చితమైన తీర్మానాల ద్వారా టీం నడుస్తుంది. ఏమీ ఆశించకుండా జనసేన కోసం పనిచేసే జనసైనికులకు ఆహ్వానిస్తుంది. మాటలు కాకుండా చేతలు ద్వారా చేసి చూపించాలని ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ, మరో పక్క సేవాకార్యక్రమాలు చేస్తూపోతుంది. నాయకుల గుర్తింపు కోసం పాకులాడకుండా గాజువాక లో జనసేన జెండా ఎగురవేయడమే టీం లక్ష్యంగా నడుస్తుందన్నారు. MLA సీటు ఎవరికి ఇచ్చినా దానితో సంబంధం లేకుండా పార్టీ గెలుపే ముఖ్య ఉద్దేశంగా ముందుకు పోతుంది. నాయకులు ఇచ్చే గౌరవం కన్నా... ఒక జనసైనికుడిగా నిత్యం తన భుజాలపై జనసేన జెండా మోయడం గొప్ప గౌరవంగా ఈ టీం భావిస్తుంది. అందరి సహకారంతో టీం నడుస్తుంది. ఎవ్వరైనా టీం లో చేరాలని వుంటే తెలియజేయవచ్చు అన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com