విశాఖపట్నం ( జనస్వరం ) : అచ్యుతాపురం మండలం మడుతూరు జంక్షన్ నుండి రాజన్నపాలెం వరకు వెళ్ళే రోడ్డులో ఇటీవల రోడ్డు మరమ్మతులు జరిపి ఉన్నారు. రోడ్డుకు ఇరువైపులా ఉన్న అంచులను గ్రావెల్ తో పూడ్చకపోవడంతో ప్రతి రోజు ఆ రోడ్డులో ప్రయాణిస్తున్న ముఖ్యంగా ద్విచక్రవాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. ఈ రోడ్డులో బార్క్ పరిశ్రమ ఉండటం దానికి ప్రతిరోజు వందల లారీలలో గ్రావెల్ లారీలు తిరగడం అదే విధంగా తంతడి పర్యాటక ప్రాంతం కావడంతో నిత్యం రద్దీ గా ఉండటంతో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై జనసేన వీరమహిళ మోటూరు శ్రీవేణి ఆధ్వర్యంలో మడుతూరు జనసైనికులు నిరసన తెలిపి వెంటనే అంచులు పూడ్చాలని డిమాండ్ చేశారు. తదనంతరం అచ్యుతాపురం మండలాభివృద్ధి అధికారిణిని వారి కలిసి వినతిపత్రం అందచేసి రోడ్లు భవనాలు ఇంజనీర్ వారి దృష్టికి తీసుకెళ్లి గుత్తేదారులతో మాట్లాడి రోడ్డుకు ఇరువైపులా గ్రావెల్ తో పూడ్చేలాగా ఆదేశాలు ఇచ్చి ప్రమాదాలు జరగకుండా చూడాలని జనసేన పార్టీ తరపున కోరారు. ఈ కార్యక్రమంలో జనసైనికులు దేశంశెట్టి శశిధర్, నీరుకొండ సంతోష్, బలిరెడ్డి పూర్ణ, శనివాడ నాగు, మాసారపు చింతలనాయుడు మరిశా నానాజీ, గంధం నానాజీ, పారిపల్లి చంటి, బొర్రా బాబురావు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com