Logo
Date of Publish : 26 February 2024, 10:52 pm
Editor : Sake Naresh

గడిచిన 56నెలలుగా గుడ్డి గుర్రాలకు పల్లు తోమావా అనంత వెంకటరామిరెడ్డి..

 అనంతపురం ( జనస్వరం ) :  జనసేన పార్టీ రాయలసీమ రీజినల్ ఉమెన్ కో-ఆర్డినేటర్ పెండ్యాల శ్రీలత మహిళలతో మాటామంతి కార్యక్రమంలో భాగంగా అనంతపురం అర్బన్ నియోజకవర్గం నారాయణపురం గ్రామ పంచాయతి ఇందిరమ్మ కాలనీలో 38వ రోజు మహిళలతో మాటామంతి కార్యక్రమం నిర్వహించి స్థానిక సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి గడిచిన 56నెలలుగా అర్బన్ నియోజకవర్గ అభివృద్ధిని గాలికి వదిలేసి తీరా ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రజలను మేసం చేయడానికి శంకుస్థాపనలు చేస్తున్నాడని అన్నారు.  తడకలేరు వంకపై బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని నారాయణపురం పంచాయతి ఇందిరమ్మ కాలనీ వాసులు ఎమ్మెల్యే కి అనేకసార్లు విన్నవించుకున్నా ఏమాత్రం పట్టించుకోకుండా ఇప్పుడు ఎన్నికలముందు హడావిడిగా బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేసారు. ఐదు, ఆరు నెలలలో పూర్తి చేస్తా అని అంటున్నాడని ఈ బ్రిడ్జి నిర్మాణం నారాయణ పురం ప్రజల కల అని అన్న ఎమ్మెల్యే అనంత గతంలో ఇదే ప్రాంతానికి ఎంపీగా ప్రస్తుత ఎమ్మెల్యే గా కొనసాగుతున్న నువ్వు ఇన్ని సంవత్సారాలు ఏమి చేసావు కేవలం ఎన్నికలముందే నీకు ప్రజల కష్టాలు వారి కలలు గుర్తుకు వస్తాయా ... కేవలం ప్రజలను మరొక్కసారి ఏమార్చి గెలవడానికి చూస్తున్నావే తప్ప నిజంగా అనంతపురం నగరాన్ని అభివృద్ధి చేయాలన్న చిత్తశుద్ధి నీకు లేదన్నారు. స్థానిక ఇందిరమ్మ కాలనీ ప్రజలు కూడా ఎమ్మెల్యే అనంత ఎన్నికల ముందు వచ్చి హడావిడి చేస్తున్నాడని అంటున్నారు.. ఈ సందర్భంగా స్థానిక ప్రజలకు మేము ఓకటే చెప్తున్నాము ఏలాగే ఈ వైకాపా ప్రభుత్వం అధికారం కోల్పోతుంది జగన్ జైలులో వెళ్తాడు  ఈ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే ఔతాడు ఈ బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టేది త్వరలో ఏర్పాటు కాబోయే జనసేన టీడీపీ ఉమ్మడి ప్రభుత్వమే అని కనుక ప్రజలంతా జనసేన టీడీపీలకు ఓటు వేసి ఆశీర్వదించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వీర మహిళలు జనసేన నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొనడం జరిగింది.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com