Logo
Date of Publish : 15 December 2020, 3:03 pm
Editor : Sake Naresh

జనసేన బలోపేతం కోసం..మేము సైతం -“రాజ్యాధికారం” మాలక్ష్యం : పూతలపట్టు జనసైనికులు

జనసేన బలోపేతం కోసం..మేము సైతం -"రాజ్యాధికారం" మాలక్ష్యం : పూతలపట్టు జనసైనికులు

                  "జనసేనపార్టీ బలోపేతం కోసం.. మేము సైతం".. అహర్నిశలు శక్తివంచన లేకుండా కృషి చేస్తామని... రాజ్యాధికారంకి ఆమడ దూరంలో ఉన్న బడుగు, బలహీనవర్గాల ప్రజలందరినీ కలుపుకుని సమిష్టికృషితో "రాజ్యాధికారం" సాధించడమే.. మా లక్ష్యం అని చిత్తూరు జిల్లా జనసేన పార్టీ నాయకులు పుంగనూరు నానబాల లోకేశ్వర, లోకేష్ రాయ్, ఏపీ శివయ్యలు పేర్కొన్నారు.

                చిత్తూరుజిల్లా పూతలపట్టు మండలం వేపనపల్లి జనసైనికులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా లోకేష్ రాయ్, శివయ్యలు మాట్లాడుతూ.. నీతి, నిజాయితీ, నిబద్ధత తో నిస్వార్థంగా జనసేనాని పవన్ కళ్యాణ్ అడుగు జాడల్లో నడుస్తూ.. "ఆశతో కాకుండా ఆశయ సాధనకోసం" ప్రజా సమస్యలపై అనునిత్యం స్పందిస్తూ, "అకుంఠిత దీక్షతో పని చేస్తున్న పూతలపట్టు నియోజకవర్గ జన సైనికులునుద్ధేశించి మాట్లాడుతూ.. క్షేత్ర స్థాయిలో జనసేనపార్టీ బలోపేతంకోసం... మేముసైతం.. మీకు అండగా ఉంటామని "భరోసా" ఇచ్చారు. దేశ సమగ్రత ను దృష్టిలో ఉంచుకుని, అఖిల జనంకోసమే జనసేనాని పవన్ కళ్యాణ్ ఎన్నోఒత్తిళ్లను తట్టుకుని, ఒడిదుడుకులు, అవాంతరాలు వచ్చినప్పటికీ సమర్థవంతంగా జనసేనపార్టీని వ్యవస్థాపించారన్నారు. ప్రతిగ్రామంలో అందరి వాడైన అన్నయ్య మెగాస్టార్ చిరంజీవిని అమితంగా ఇష్టపడేవాళ్ళు, ఆరాధించేవాళ్ళు లెక్కకు మించి ఉన్నారన్నారు. మెగా ఫ్యామిలీకి, మెగా హీరోలందరిపట్ల ఆప్యాతానురాగాలు కలిగి ఎంతో క్రమశిక్షణ కలిగిన కోట్లాదిమంది అభిమానులను, కార్యకర్తలను పొందడం అంటే ఆషామాషీ కాదన్నారు. జనసేనాధిపతి పవన్ కళ్యాణ్ కూడా సమ సమాజ స్థాపనే ధ్యేయంగా అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారన్నారు. అంతే కాకుండా సిద్ధాంతాలను, ఆశయాలు ఏర్పరచుకున్న ఏకైక పార్టీ ఏదైనా ఉందా అంటే అది కేవలం జనసేనపార్టీ మాత్రమే అన్నారు.

👉కులాలను కలిపే ఆలోచనా విధానం
👉మతాల ప్రస్థావన లేని రాజకీయం
👉భాషల్ని గౌరవించే సంప్రదాయం
👉సంస్కృతుల్ని కాపాడే సమాజం
👉ప్రాంతీయతని విస్మరించని జాతీయ వాదం
👉అవినీతి పై రాజీలేని పోరాటం
👉పర్యావరణాన్ని పరి రక్షించే అభివృధ్ధి ప్రస్థానం

                   పార్టీ ముఖ్య సిద్ధాంతాలను, జనసేనాని ఆశయాలను గ్రామస్థులకు లోకేష్ రాయ్, శివయ్య తెలియజేశారు. మహనీయుల మార్గంలో పయనిస్తూ.. మహాత్ముల ఆశయాలు నెరవేర్చేదిశగా ఓర్పు, నేర్పు, పోరాట పటిమని సొంతం చేసుకుని జీరోబడ్జెట్ తో రాజకీయాలు చేస్తూ.. "నవ యువ శకానికి నాంది పలికి, సమ సమాజ స్థాపనకు కంకణ బద్ధుడైన మహోన్నత వ్యక్తి, సమ్మోహనశక్తి పవన్ కళ్యాణ్ అని వారిద్దరూ కొనియాడారు. ప్రకృతి ప్రకోపాలప్పుడు ప్రజలు అనేక ఇబ్బందులకు గురైన సందర్భాలలో వెంటనే చలించి స్పందించే మహోన్నతమైన గొప్ప సుగుణాలను కలిగిన దైవం మానవ రూపేణా అన్నరీతిలో ఎవరైనా ఉన్నారంటే నిస్సందేహంగా.. నిస్సంకోచంగా మెగా బ్రదర్స్, మెగాఫ్యామిలీ తో పాటుగా జనసేన కుటుంబ సభ్యులందరూ నిలుస్తున్నారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదన్నారు. ఈసందర్భంగా జనసేనపార్టీ తరపున ఈ సంవత్సరం జరిగిన ఎన్నికల ప్రక్రియలో ఎన్నో అవాంతరాలను ఎదుర్కొని పూతలపట్టు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని వేపనపల్లి ఎంపీటీసీ అభ్యర్థిగా నామినేషన్ వేసి, గట్టిగా నిలబడి పోరాడిన ఊరుబిండి మహేష్, అతనికి అన్నివిధాలా సహకారాన్ని ధైర్యంగా అందించిన బండారు మనోహర్, ఊరుబిండి గోపి, మాసినేటి వినీత్, చంటిరాయల్, మౌనేంద్ర, కూటంవారిపల్లి ఎంపీటీసీ మహిళా అభ్యర్థి జనసేన ఝాన్సీ వీరమహిళ హేమలత, జయప్రకాష్ లతో పాటు పార్టీకి అంకితభావంతో పనిచేస్తున్న తులసీరాం‌, గణపతి, నరేష్, వరుణ్ కుమార్, హరీష్ తదితరుల కృషి అభినందనీయమని, అది వెలకట్టలేనిదని, విశేష సేవలను అందిస్తున్న వారిని అభినందించారు. ఇదే స్ఫూర్తితో మున్ముందు కూడా పార్టీకి మనమంతా సేవలందించాలని పేర్కొన్నారు. అదే విధంగా పార్టీకి, అధినేత ఆశయాల సాధనకు పలువురు గ్రామస్థులు, మహిళలు తమవంతు సంపూర్ణ మద్దతు ఇస్తుండడం విశేషమని వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. జనసేనఅధినేత ఆశయాలు, సిద్ధాంతాలు ఎంతో ఉన్నతమైనవని వారు పేర్కొనడం గమనార్హం.

                  రాబోవు రోజులలో జరగనున్న "స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేనపార్టీ మద్ధతుతో పోటీచేసే అభ్యర్థుల విజయానికి తామంతా సంపూర్ణంగా తోడ్పాటు అందిస్తామని" గ్రామస్థులు తెలిపారు. ఇక త్వరలోనే జనసేనపార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అటు తెలంగాణా, ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలోనే కాకుండా "దక్షిణ భారతదేశ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించి తన ప్రత్యేకతను చాటుకుంటారని" చెప్పారు. దీనికి ఇటీవల జరిగిన తెలంగాణ జీహెచ్ ఎంసీ ఎన్నికలలో విస్తృత ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని బీజేపీ అగ్రనేతల అభ్యర్థనమేరకు ఆపార్టీ అభ్యర్థుల విజయానికి సంపూర్ణమద్దతు తెలిపారన్నారు. దీంతో హైదరాబాద్ గ్రేటర్ ఎన్నికల ఫలితాలు, విజేతలైన బీజేపీ కార్పోరేటర్ అభ్యర్థుల గెలుపే నిదర్శనం అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో "జనరంజక పాలన అందించడానికి జనసేన ప్రభుత్వం" ఖచ్చితంగా ఏర్పాటు కావడం ఖాయమన్నారు. నాటి, నేటి పాలకులు ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభించారని మహిళలు దుయ్యబట్టారు. "చేయి చేయి కలిపితే గెలుపు చేజారదని" వారు తెలిపారు. ప్రజల్లో చైతన్యం కలిగిందని, మార్పు మొదలైందని స్పష్టం చేశారు. "ప్రజాచైతన్య జ్వాలలు పెల్లుబికి "నిశ్శబ్ద విప్లవం" "లావా" లాగా పెంపొంది జనసేనపార్టీ పటిష్టతకు "చాపకింద నీరువలె" పాకుతోందన్నారు. నేటి ప్రభుత్వం అన్నిటా విఫలమైందని ప్రజలందరూ అన్నీ క్షుణ్ణంగా గమనిస్తున్నారన్నారు. "గెలిచినోళ్ళు గాజులు తొడుక్కొని కాలం వెళ్ళ దీస్తూ రాష్ట్రప్రజల సంక్షేమం మరచి, కనికరం లేకుండా ప్రజలనెత్తిపై అప్పుల పెనుభారం మోపుతుంటే.." "రెండుచోట్లా ఓడినోడు మాత్రం ప్రజలు కష్టాలలో ఉంటే జనసేన శ్రేణులు అంతా ఎల్లప్పుడూ మీకు అండగా ఉందని చాటి చెప్పుచూ.. భరోసాను, ఆత్మస్థైర్యం నింపుతూ.. ఓదార్చుతున్నాడని పవన్ కళ్యాణ్" ను, అతని ఔదార్యాన్ని ఆ గ్రామస్థులకు లోకేష్ రాయ్, శివయ్య తెలియజేశారు. కుటుంబం అన్నాక చిన్నచిన్న ఆటుపోట్లు సహజంగా వచ్చినా.. వాటిని మొగ్గలోనే తుంచేయాలని అందరూ కలసిమెలసి కార్యోన్ముఖులై కార్యదక్షతో సమిష్టిగా ప్రజల క్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని పార్టీ బలోపేతానికి కృషి చేద్దామని లోకేష్ రాయ్, శివయ్య పేర్కొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com