కడప ( జనస్వరం ) : జనసేన పార్టీ 2024 ఎన్నికల కార్యక్రమాల నిర్వహణ రాయలసీమ జోన్ 1 కో-కన్వీనర్ గా పండ్రా రంజిత్ కుమార్ కు పదవి వరించింది. కడపలో తన ఆప్తులు మిత్రులు సంబరాలు చేసుకున్నారు. అందులో భాగంగా జనసైనికులు రామసిద్దు, రాము, శివ, వారి బృందం కడపలో రంజిత్ కుమార్ ను ప్రత్యేకంగా కలిసి శాలువ బొకేతో సత్కరించారు. కడప స్థానిక 48వ డివిజన్ అక్కయ్య పల్లి లోని సాయి కృష్ణ ఆధ్వర్యంలో భారీ ఎత్తున బాణసంచా కాల్చి ఆయనకు ఘన స్వాగతం పలికి, శాలువా బొకేతో సత్కరించారు. అనంతరం కడప జనసేన పార్టీ నాయకులు అబ్బన్నగారి రాజగోపాల్ ఆధ్వర్యంలో స్థానిక ప్రేమాలయ ఆశ్రమంలో నిరుపేద అభాగ్యులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసి వారి మధ్య సంబరాలు చేసుకొని అతనికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బ్రహ్మం నాయక్, బాలు నాయక్, కుమార్ నాయక్, సుధీర్ నాయక్, రూప్ కుమార్, మనీ, వంశీకృష్ణ, రాజా, రాజశేఖర్, జానీ, సద్దాం, రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com