Search
Close this search box.
Search
Close this search box.

విజయవాడలో ఫుడ్‌ కోర్టుల మాఫియా..

విజయవాడ

– అనధికారంగా ఎక్కడపడితే అక్కడ ఫుడ్‌ కోర్టులు
– వైసీపీలోని కొంతమంది నాయకులు కోసం చిరు వ్యాపారుల జీవితాలు అన్యాయమైపోవాలా?
– ఫుడ్‌ కోర్ట్‌ నిర్మాణం తక్షణమే ఆపాలి.
– పంజా సెంటర్‌ ఫుడ్‌ కోర్ట్‌తో అనేక మంది బతుకులు చిన్నాభిన్నం
– వెల్లంపల్లి శ్రీనివాస్‌.2 రాయన భాగ్యలక్ష్మి.2 ఆర్షద్‌.2 ఒక్కొక్క షాపు మూడు నుంచి ఐదు లక్షలకు అమ్మకం.
– కౌన్సిల్లో ఫుడ్‌ కోర్టు కోసం ప్రతిపాధించింది స్థానిక కార్పొరేటర్‌ ఆర్షద్‌
– వైసీపీ నాయకులపై నిప్పులు చెరిగిన పోతిన మహేష్‌
               విజయవాడ, నవంబర్‌ 24 : పంజా సెంటర్లో ఫుడ్‌ కోర్ట్‌కి వ్యతిరేకంగా జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జ్‌ పోతిన వెంకట మహేష్‌ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మహేష్‌ మాట్లాడుతూ నగరంలో ఫుడ్‌ కోర్టుల మాఫియా నడుస్తుందని, అనధికారంగా ఎక్కడపడితే అక్కడ ఫుడ్‌ కోర్టులు ఏర్పాటు చేస్తూ ఉన్నారని, సమాచారం ప్రకారం ఇందిరాగాంధీ స్టేడియం వద్ద ఉన్న ఫుడ్‌ కోర్టుకు మాత్రమే వీఎంసీ అనుమతులు ఉన్నాయని, మిగతా చోట్ల ఉన్న ఫుడ్‌ కోర్టులకు పూర్తి అనుమతులు లేవని, పంజా సెంటర్లో ఏర్పాటు చేయబోతున్న ఫుడ్‌ కోర్టుని పశ్చిమ నియోజకవర్గ జనసేన పార్టీ తరపున పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని ఆగ్రహాం వ్యక్తం చేశారు. రైల్వే స్టేషన్లో 24 గంటలు క్యాంటీన్స్‌ అందుబాటులో ఉంటాయని, పంజా సెంటర్లో రాత్రి 11.00 గంటల వరకు బిర్యాని, పుల్కా టిఫిన్‌ సెంటర్లు అందుబాటులో ఉంటాయని, పాతబస్తీ, పశ్చిమ నియోజకవర్గంలో అనేక టిఫిన్‌ క్యాంటీన్లు, బండ్లపై టిఫిన్‌ అందుబాటులో ఉంటాయని, మరి ఎవరికి లబ్ధి చేకూర్చడానికి ఈ ఫుడ్‌ కోర్టులు ఏర్పాటు చేస్తున్నారని, వైసీపీలోని కొంతమంది నాయకులు కోసం పశ్చిమ నియోజకవర్గం చిరు వ్యాపారుల జీవితాలు అన్యాయమైపోవాలా? అని ప్రశ్నించారు. ఫుడ్‌ కోర్ట్‌ నిర్మాణం తక్షణమే ఆపాలని, ఆపకపోతే ఏర్పాటు చేసిన తర్వాత అయినా అమ్మ కాలు అడ్డుకుంటామని హెచ్చరించారు. వెల్లంపల్లి శ్రీనివాస్‌.2 రాయన భాగ్యలక్ష్మి.2 ఆర్షద్‌ .2 ఒక్కొక్క షాపు మూడు నుంచి ఐదు లక్షలకు అమ్మకం చేశారని, కౌన్సిల్లో ఫుడ్‌ కోర్టు కోసం ప్రతిపాదించింది ముమ్మాటికి స్థానిక కార్పొరేటర్‌ ఆర్షద్‌అని, అసలు ఇక్కడ ఫుడ్‌ కోర్ట్‌ పెట్టవలసిన అవసరం ఏమొచ్చిందని, పంజా సెంటర్లో ఫుడ్‌ కోర్టుకు ప్రజాభిప్రాయ, స్థానిక ప్రజల వ్యాపారస్తుల అభిప్రాయ సేకరణ ఎందుకు తీసుకోలేదో అధికారులు గానీ వైసీపీ నాయకులు గాని సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. ముసాఫిర్‌ ఖానా ఎదురుగా కావాలని ఫుడ్‌ కోర్ట్‌ ఏర్పాటుకు వైసీపీ స్థానిక ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు, మేయర్‌ భాగ్య లక్ష్మి సూచనల మేరకే స్థానిక కార్పొరేటర్‌ హర్షద్‌ కౌన్సిల్లో తీర్మానం ప్రవేశపెడితే అందరూ దాన్ని ఆమోదించారని, ఇక్కడ 14 షాపులు పెట్టడానికి రంగం సిద్ధం చేసిందని, ఎందుకంటే పశ్చిమ నియోజకవర్గంలో వందల మంది చిరు వ్యాపారస్తుల పొట్టలు కొట్టి 14 మంది వద్ద వైసీపీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు, మేయర్‌ భాగ్యలక్ష్మి, కార్పొరేటర్‌ హర్షద్‌ అలాగే మరి కొంతమంది కార్పొరేటర్లు డబ్బులు కొట్టేయడానికే అని, దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. సామాన్య వర్గాలకు అండగా నిలబడేందుకు కేసులకు, రిమాండ్లకు భయపడేది లేదని, ఫుడ్‌ కోర్టు ఏర్పాటు చేస్తే మూసాఫిర్‌ ఖానా పార్కింగ్‌కి ఇబ్బంది వస్తుందని, బస్టాప్‌ సమస్య వస్తుందని, పాత బట్టలు అమ్ముకునే గుజరాతి సంఫీులకు ఇబ్బంది వస్తుందని, సాయి దుర్గ ఆటో స్టాండ్‌ వాళ్లకి ఇబ్బంది వస్తుందని, దీనితో పాటు ముఖ్యంగా గంజాయి బ్లేడ్‌ బ్యాచ్‌ వాళ్లకి ఇది అడ్డగా మారిపోతుందని తెలియజేశారు. గతంలో రైల్వే ఫుట్‌ బ్రిడ్జ్‌ మీద గంజాయి బ్లేడ్‌ బ్యాచ్‌ వాళ్ళనీ నిరోధించడానికి పోలీసు వాళ్ళకి చాలా సంవత్సరాలు పెను సవాల్‌గా మారిందని, మరల ఫుడ్‌ కోర్ట్‌ పెడితే ఆ కల్చర్‌ వస్తుందని దీనికి బాధ్యత ఎవరని? ప్రశ్నలా వర్షం కురిపించారు. గంజాయి బ్లేడ్‌ బ్యాచ్‌ ఆగడాలకి అలాగే ఫుడ్‌ కోర్ట్‌ మాఫియాకి దీన్ని కేంద్రంగా మారుస్తామంటే వూరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ఫుడ్‌ కోర్టు నిర్మాణం అర్ధరాత్రి పూట ఎందుకు చేస్తున్నారని, అసలు నిర్మాణం చేయాల్సిన అవసరం ఏముందని, నగరంలో అనధికార ఫుడ్‌ కోట్ల ఏర్పాటుకు అధికార పార్టీకి వీఎంసీ అధికారులు పూర్తిగా అండదండలు అందిస్తున్నారంటే అవినీతిలో వారి వాటా ఎంత కమిషనర్‌ స్పందించాలని, వీఎంసీ అధికారులు ఏం చేసినా చెల్లుబాటు అవుతుందా? అని ఫుడ్‌ కోర్ట్‌ నిర్మాణం అక్రమమా? సక్రమమా? శాంతి కల్చరల్‌ అసోసియేషన్‌ చిన్న చెక్క డబ్బా సందు లోపల ఎక్కడో ఉంటేనే అనధికారం అన్నారని, పంజా సెంటర్లో ఫుడ్‌ కోర్ట్‌ పై టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు ఎందుకు స్పందించరని, ముస్లింల మనోభావాలను దెబ్బతీసే ఫుడ్‌ కోర్ట్‌ ను తక్షణమే నిలిపివేయాలని, ముసాఫిర్‌ ఖానాకు పార్కింగ్‌ సమస్య పాటు, జండా చెట్టును అవమానిస్తే ముస్లింల మనోభావాలు తీవ్రంగా గాయపడతాయని, తక్షణమే ఫుడ్‌ కోర్టును నిలిపివేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సోమి గోవింద్‌ దుర్గాప్రసాద్‌, సత్యనారాయణ, శ్రీను దుర్గారావు, రవి, చిన్న, పైడి, సమీర్‌, మొబీనా, సాల్మ, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం
WhatsApp Image 2024-10-14 at 5.45
కందుకూరులో ఘనంగా పల్లె పండుగ వారోత్సవాలు
IMG-20240918-WA0003
కందుకూరులో స్వచ్ఛత హి సేవా కార్యక్రమం
కందుకూరు
కందుకూరు గ్రామంలో వాటర్ ట్యాంక్ క్లీన్ చేసిన సిబ్బంది

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way