Logo
Date of Publish : 14 November 2020, 2:23 pm
Editor : Sake Naresh

పుష్కర ఘాట్ల నాణ్యతపై దృష్టిపెట్టాలి : జనసేన ఎమ్మిగనూరు ఇంచార్జ్ రేఖగౌడ్

పుష్కర ఘాట్ల నాణ్యతపై దృష్టిపెట్టాలి : జనసేన ఎమ్మిగనూరు ఇంచార్జ్ రేఖగౌడ్

          తుంగభద్ర పుష్కరాలకు వచ్చే భక్తుల కోసం ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న పుష్కర ఘాట్లను ఉన్నత అధికారుల పర్యవేక్షణలో పనులను నాణ్యతతో త్వరితగతిన పూర్తిచేసేలా చర్యలు చేపట్టాలని జనసేనపార్టీ రాష్ట్ర మహిళ సాధికార ఛైర్మెన్ రేఖగౌడ్ తెలిపారు. శనివారంరోజు ఎమ్మిగనూరు జనసేనపార్టీ కార్యాలయంలో ఎమ్మిగనూరు మండల కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రేఖగౌడ్ మాట్లాడుతూ పుష్కరాలలో భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని కోరారు. కోట్లు ఖర్చు పెట్టి పుష్కర ఘాట్లను ఏర్పాటు చేయిస్తున్న ప్రభుత్వం వాటి నాణ్యతను పరిశీలించకపోతే తీవ్రనష్టం జరుగుతుందని అన్నారు. కరోనాను దృష్టిలో పెట్టుకొని ప్రజలు జాగ్రత్తగా దీపావళి పండుగను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని చెడుపై మంచి సాధించిన విజయంలో వాయు కాలుష్యం నివారణకై కృషి చేస్తూ ముందుకు పోవాలని కోరుతూ ఎమ్మిగనూరు నియోజకవర్గ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.

ఎమ్మిగనూరు మండల కమిటీ ఎన్నిక :-

    జనసేనపార్టీ ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇంచార్జి రేఖగౌడ్ ఆధ్వర్యంలో శనివారంరోజు నిర్వహించిన ఎమ్మిగనూరు మండల కార్యకర్తల సమావేశం అనంతరం ఎమ్మిగనూరు మండల నూతన కమిటీని ప్రకటించారు. ఎమ్మిగనూరు మండల అధికార ప్రతినిధిగా రాహుల్ సాగర్, మండల ప్రధాన కార్యదర్శి బజారి, ప్రచార కార్యదర్శి మనోహర్, కార్యనిర్వహణ కార్యదర్శి వీరకుమార్, కార్యదర్శులు, అంపయ్య, కృష్ణలను ఎంపిక చేశారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com