సర్వేపల్లి ( జనస్వరం ) : ముత్తుకూరు మండలంలోని గురవయశాల నందు ఆదివారం జనసైనికులతో కలిసి పంచాయతీ కాలవలలో బ్లీచింగ్ చల్లి పారిశుద్ధ్య నిర్మూలనలో పాల్గొన్న జనసేన పార్టీ సర్వేపల్లి నియోజకవర్గ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు. ఆయన మాట్లాడుతూ పంచాయతీ వ్యవస్థ పారిశుధ్యంతో పడకేసిందని అన్నారు. సర్వేపల్లి నియోజకవర్గంలోని 117 పంచాయతీలలో పారిశుద్ధ్యం కరువై దోమల బెడద తీవ్రమైంది. పంచాయతీలలో నిధులు లేవు, మరి ఆ నిధులు ఎటు పోతున్నాయో వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికే తెలియాలి. సర్వేపల్లి నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశానని కాకాని గోవర్ధన్ రెడ్డి చెప్పుకోవడం తప్ప సర్వేపల్లిలో జరిగిన అభివృద్ధి మాత్రం శూన్యమని అన్నారు. పంచాయతీ కాలువల్లో మురుగునీరు నిలిచిపోయి ప్లాస్టిక్ కవర్లతో కుళ్ళిపోయిన వ్యర్థాలతో దోమలు ఏర్పడి అంటు రోగాలు వచ్చి ప్రజలకు ప్రాణహాన్ని కలిగే పరిస్థితులు వున్నాయి. అంటురోగాల బారిన పడి రూ.లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని నయం కానీ స్థితిలో ప్రజలు ఉన్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని, మంత్రులు, ఎమ్మెల్యేలు అందరిని కూడా మేము ఒకటే కోరుతున్నాం, మా అధినేత పవన్ కళ్యాణ్ గారి పై, టీడీపీ, జనసేన పొత్తుల గురించి, వారాహి విజయయాత్ర పై విమర్శలు చేయడం, వ్యక్తిగత దూషణలకు దిగడం ఆపేసి గ్రామ పంచాయతీలలో పారిశుద్ధ్య పనులను చేపట్టండని అన్నారు. నాలుగు సంవత్సరాల ఏడు నెలల కాలంలో మీరు ఏం అభివృద్ధి చేశారో ముందు తెలియజేయండి, ఆ తర్వాత మిగిలిన విషయాలు మాట్లాడుకుందామని అన్నారు. మీరు ఏం చేయకుండానే గ్రామాలలో అభివృద్ధి లేకుండానే నోరు ఉంది కదా అని చెప్పి మీ ఇష్టానుసారంగా మాట్లాడుతుంటే ఎవరు చూస్తూ ఊరుకోరు. 2024లో రాబోయేది ప్రజా ప్రభుత్వమే, రాష్ట్ర అభివృద్ధి, యువత భవిష్యత్తు, గ్రామ పంచాయతీలలో అభివృద్ధి జరగాలంటే రాబోయే టీడీపీ, జనసేనలు కలిసి స్థాపించే ప్రజా ప్రభుత్వంతోనే సాధ్యం. రాష్ట్ర ప్రజలు కూడా ప్రజా ప్రభుత్వానికి మద్దతు పలికి ఓట్లు వేసి గెలిపించాల్సిన అవసరం ఉంది. ఈ కార్యక్రమంలో ముత్తుకూరు మండల సీనియర్ నాయకులు రహీం, తోటపల్లి గూడూరు మండల నాయకులు కోసూరు నారాయణ, పవన్ కళ్యాణ్ యువత అధ్యక్షుడు అశోక్, ప్రధాన కార్యదర్శి సుమన్, చిరంజీవి యువత అధ్యక్షుడు ఖాజా, వెంకటాచలం మండల కార్యదర్శి శ్రీహరి, జనసేన నాయకులు ఖాదర్ బాషా, గౌస్ బాషా, హరి తదితరులు పాల్గొన్నారు.