అవనిగడ్డ, (జనస్వరం) : అవనిగడ్డలో గల కోర్టు సెంటర్లో శనివారం కృష్ణా జిల్లా జనసేన పార్టీ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు మత్తి వెంకటేశ్వరరావు ఆధ్యర్యంలో బండ్రెడ్డి రాము అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కార్యవర్గ సభ్యులు తమ నియోజకవర్గాలలో నెలకొన్న పరిస్థితులను సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. అనంతరం రాము విలేకర్లతో మాట్లాడుతూ, అధికార వై.ఎస్.ఆర్ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల నేతలు ఒకరిని మరొకరు విమర్శించుకుంటూ అభివృద్ధిని గాలికి వదిలేశారన్నారు. మాదక ద్రవ్యాలపై రెండు పార్టీలు కూడపలుక్కుని విషయం బయటకు రాకుండా గొడవలు సృష్టిస్తున్నారని దుయ్యబట్టారు. కొద్ధి రోజుల నుంచి రెండు పార్టీల విమర్శలు మీడియాలో చూస్తుంటే సభ్యసమాజం తల దించుకునేలా ఉన్నదన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో పాలన రాక్షస పాలనను తలపించేలా వున్నదని అధికార పార్టీపై విమర్శలు గుప్పించారు. అవనిగడ్డ శాసనసభ్యులు సింహాద్రి రమేష్ బాబు తక్షణమే రోడ్ల నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు. శాసన సభ్యులు ప్రజా జీవితంలోకి వచ్చి ప్రజల సమస్యలను పరిష్కరించాలన్నారు. ప్రజా సమస్యలు విస్మరిస్తే, ప్రజలే బుద్ధి చెబుతారని రాము అన్నారు. ఈ కార్యక్రమములో జిల్లా జనసేన నాయకులు మరియు జనసైనికులు తదితురులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com