• వైసిపి మంత్రులు, ఎమ్మెల్యేలు నోరు అదుపులో పెట్టుకోవాలి
• పవన్ కళ్యాణ్ ని విమర్శిస్తే.. చూస్తూ ఊరుకోం
• చీకటి జీవోను వెంటనే రద్దు చేయండి
• నెల్లూరు జిల్లా జనసేనపార్టీ అధ్యక్షులు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి
నెల్లూరు, (జనస్వరం) : పవన్ కళ్యాణ్ పై చేస్తున్న విమర్శనాలు మానుకొని.. ఓటేసి గెలిపించిన ప్రజల సమస్యలపై దృష్టి పెట్టాలని జనసేన పార్టీ అధ్యక్షులు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి మండిపడ్డారు. నగరంలోని జనసేన పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్, చంద్రబాబు భేటి అనంతరం రాష్ట్రంలో వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఉలిక్కిపడుతున్నారు. భేటీ తరువాత వైసీపీ మంత్రులు నోటుకి ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతుంటే.. ప్రజలు కూడా అసహ్యించుకుంటున్నారన్నారు. ప్రజా సమస్యలు తీర్చేందుకు వైసీపీ అభ్యర్థులను ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా గెలిపించుకుంటే వారికి ఓట్లు వేసిన ప్రజలే అసహించుకునేల ప్రతిపక్షనేతలపై విమర్శలు చేస్తున్నారన్నారు. వైసీపీకి చిత్తసుద్థి ఉంటే చీకటి జీవో నంబర్ 1ను ఎందుకు తీసుకువచ్చారని రాష్ట్ర ప్రభుత్వానికి ప్రశ్నించారు. ప్రతిపక్షాలు ప్రజా సమస్యలు వినకుండా, ప్రజల వద్దకు వెళ్లీ వారి కష్టాసుఖాలను పలకరించేందుకు వీలులేకుండా చీకటి జీవోను తీసుకొని వచ్చారని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం తీసుకుంటున్న తప్పుడు నిర్ణయాలు, దౌర్జన్యాలు, అరాచకాలపై పోరాడేందుకు రాబోవు రోజుల్లో అంతా కలిసి పోరాడతామని స్పష్టం చేశారు.ఐటి పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాద్‌కు ఆశాఖ గురించి అవగాహన కూడా లేదని.. ఎక్కడ కూడా ఒక పరిశ్రమను తీసుకొని రాలేదన్నారు.అతను స్టేజీపై డ్యాన్స్‌లు వేసుకోవాడానికే పనికొస్తారని విమర్శించారు. పేదలందరికి ఇళ్లు అన్న వైసీపీ అందరికి కన్నీల్లే మింగిచ్చిందని అంలాంటి విషయాలపై గృహనిర్మాణ శాఖ మంత్రి దృష్టి పెడితే బాగుంటుందని హితువు పలికారు. వాటిని వదిలేసి పవన్ కళ్యాన్ ని విమర్శిస్తే సహించేది లేదని హెచ్చరించారు. యాక్టింగ్, డైలాగులు చెప్పే జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు పోలవరం ఎప్పుడు కంప్లీట్ చేస్తారంటే చెప్పలేక పోతున్నారని.. అటువంటి మంత్రులు మనకు ఉండటం దుద్దిష్టకరమన్నారు. ఈ కార్యక్రమంలో కృషా పెన్నా పరివాహక రిజినల్ కోఆర్టినేటర్ కోలా విజయలక్ష్మీ, జిల్లా ఉపాధ్యక్షులు బద్దిపూడి సుధీర్, జిల్లా కార్యదర్శి షేక్ ఆలియా, జిల్లా అధికార ప్రతినిది సుధీర్, జిల్లా నాయకులు షబీర్, ఉమాదేవి, కృష్ణవేని, సావిత్రి, నగర నాయకులు శ్రీధర్, సుల్తాన్ బాషా, శ్రీకాంత్, ఉదయ్, శ్రీను సర్వేపల్లి నాయకులు, బొబ్బేపల్లి సురేష్ తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com