నెల్లూరు సిటీ ( జనస్వరం ) : నియోజకవర్గంలో జనసేన పార్టీ నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్విరామంగా జరుగుతున్న పవనన్న ప్రజాబాట కార్యక్రమాన్ని 158వ రోజున 48వ డివిజన్ ఉయ్యాలకాలువకట్ట ప్రాంతంలో నిర్వహించారు. ఇక్కడ ప్రతి ఇంటికి తిరిగిన కేతంరెడ్డి ప్రజాసమస్యల అధ్యయనం చేసి అండగా ఉంటామని ప్రజలకు భరోసా కల్పించారు. ఈ సందర్భంగా కేతంరెడ్డి వినోద్ రెడ్డి మాట్లాడుతూ వాతావరణంలో మార్పులు జరుగుతున్నాయని, శీతాకాలంలో డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు సోకే అవకాశం ఎక్కువని, ఈ ప్రాంతంలో పారిశుద్ధ్య లోపం కనిపిస్తోందని, మునిసిపల్ అధికారులు దృష్టి పెట్టి దోమల నివారణ చర్యలు మొదలుపెట్టకపోతే ప్రజలకు విష జ్వరాలు ప్రబలే అవకాశాలు చాలా ఎక్కువుగా ఉన్నాయన్నారు. మునిసిపల్ అధికారులు నగర వ్యాప్తంగా ఫాగింగ్ మిషన్లు ఏర్పాటు చేయాలని, మురికి కాలువల్లో ఆయిల్ బాల్స్ వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com