రాప్తాడు నియోజకవర్గం, చెన్నేకొత్తపల్లి మండలం వైయస్సార్సీపి మరియు తెలుగుదేశం రెండు పార్టీల యొక్క ప్రెస్ మీట్ లు పబ్లిషిటికే పరిమితం అయ్యారని జనసేన నాయకులు అన్నారు. రాప్తాడు నియోజకవర్గం చెర్లోపల్లికి చెందిన ఆశా వర్కర్ ఆమెకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో మీరు ప్రెస్ మీట్ పెట్టినట్లు అనిపించడం లేదన్నారు. మీరు ఒకరిని ఒకరు విమర్శించుకోవడం మాత్రమే ఈ మీడియా ప్రెస్ మీట్లు పెట్టారని ధ్వజమెత్తారు. ప్రజల సమస్యల మీద దృష్టి పెట్టాలని అలాగే ఆశా వర్కర్ విషయంలో జరిగిన ఆమెకు తగిన న్యాయం చేయకుండా అధికార పార్టీ వాళ్ళు కేవలం మాటలకే పరిమితం అయ్యారన్నారు. ఇక ప్రతిపక్ష నాయకులు కూడా సరైన రీతిలో స్పందించేట్లదని ఆవేదన వ్యక్తం చేశారు. చెన్నేకొత్తపల్లి మండలంలో ఉన్న ప్రజా సమస్యల గురించి పోరాడండి. నాగసముద్రం రోడ్డు గురించి పోరాడండి, చెన్నేకొత్తపల్లి మోడల్ స్కూల్ వద్ద ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ వేయడం గురించి మాట్లాడండి, మండలంలో ఉన్న నీటి సమస్య గురించి మాట్లాడండి,మేజర్ గ్రామాలలో ఉన్న మురికి నీటి కాలువల సమస్యల గురించి మాట్లాడండి అంటూ ధ్వజమెత్తారు. కనీసం కోవిడ్ నిబంధనలు పాటించకుండా ప్రెస్ మీట్ లు పెడుతున్నారు. మండలంలోని రెండు పార్టీల నాయకులు ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటూ పబ్బం గడుపుతున్నారు తప్పితే ప్రజా సమస్యల గురించి ఎవరికీ పట్టదన్నారు. ప్రజలు ప్రతి ఒక్కటి గమనిస్తున్నారు రాబోయే రోజుల్లో మీకు ప్రజలు బుద్ధి చెప్తారని అన్నారు.