ధర్మవరం ( జనస్వరం ) : ధర్మవరం నియోజకవర్గం, మరియు పుట్టపర్తి నియోజకవర్గాలకు సంబంధించి ముదిగుబ్బ మండలం జిల్లేడుబండ ప్రాజెక్ట్ 0.48 TMC వున్నది ఇప్పుడు దాన్ని వైసీపీ పార్టీ వాళ్లు 2.48 కెపాసిటీకి పెంచడంతో ముదిగుబ్బ మండలం కు సంబంధించి పొడరాల్లపల్లి, బుక్కపట్నం మండలం కు సంబంధించి రామసాగరం, గోపాలపురం గ్రామాలు ముంపుకు గురవుతున్నాయి. దీన్ని ధర్మవరం జనసేన నియోజకవర్గ ఇంచార్జ్ చిలకం మధుసూదన్ రెడ్డి తీవ్రంగా ఖండిస్తూ ముంపు రైతులతో ముఖాముఖిగా వారికి జరుగుతున్న నష్టాలను తెలుసుకున్నారు. అధికారుల నిర్లక్ష్యానికి రైతులు బలి కాకుండా వెంటనే పునరావాసం కింద కల్పించకపోతే ఈ విషయన్ని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లి రైతులకు న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ముదిగుబ్బ మండల కన్వీనర్ గుర్రం జయచంద్ర,J. నరేంద్ర, నరేష్ నాయక్, గిరిధర్ నాయక్, I.హరికృష్ణ బర్మానాయక్, గుణశేఖర్, శంకరప్ప, రామాంజనేయులు, నాగరాజు చౌదరి, పవన్ కుమార్ నాయక్, బత్తలపల్లి మండల కన్వీనర్ జ్వాలాపురం పుర్రం శెట్టి రవి,జిల్లా ప్రధాన కార్యదర్శి దాసరి రామాంజనేయులు, పట్టణ నాయకులు అడ్డగిరి శ్యామ్ కుమార్,మత్స్యకార వికాస విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెస్త శ్రీనివాసులు, ధర్మవరం రూరల్ మండల కన్వీనర్ D.నాగ సుధాకర్ రెడ్డి,తాడిమర్రి మండల కన్వీనర్ కొండ్ర చంద్రబాబు నాయుడు, జిల్లా ఐటీ కో ఆర్డినేటర్ పసల శ్యామ్ సుందర్, నాయుడు నాయక్,గొట్లురు జీవి,శివ శంకర్, పేరూరు శ్రీనివాసులు, కోటికి రామాంజి, బండ్ల చంద్రశేఖర్, దాడితోట కృష్ణయ్య, నరేంద్ర, నంద ,శ్రీరామ్ రెడ్డి,లోకేష్, మరియు తదితరులు పాల్గొన్నారు.