విశాఖలో జనసేన పార్టీని బూత్ స్థాయిలో బలంగా చేసే ప్రక్రియలో జెండా ఆవిష్కరణ
జనసేన పార్టీని బూత్ స్థాయిలో బలంగా చేసే ప్రక్రియలో, ఈ రోజు విశాఖ పశ్చిమ నియోజకవర్గానికి చెందిన యువ నాయకుడు ధర్మేంద్ర కోరమాండల్ వద్ద జనసేన జెండాను ఎగురవేశారు. అనంతరం అయన మాట్లాడుతూ జనసేన జెండాను ప్రతి వార్డు లో ఎగురవేయాలని, అందువల్ల జనసేన పార్టీ సిద్ధాంతాలను వార్డుల యొక్క ప్రతి మూలకు తీసుకెళ్లగలుగుతాము ఆయన అన్నారు. అలానే ఈ కార్యక్రమానికి విచ్చేసిన విశాఖ పశ్చిమ నియోజకవర్గ నాయకులు పీలా రామకృష్ణ గారు, ఇండస్ట్రియల్ బెల్ట్ నాయకులు శ్రీకాంత్, మనోహర్, పర్మేష్, మహీంద్రా, రాధాకృష్ణ, మంజునాథ్, నాగేష్, గౌతమ్, సంతోష్, తులసి లక్ష్మణ్, గోపి, సతీబాబు, రాజేష్ పి కె మరియు ఈ కార్యక్రమానికి వచ్చిన కార్పొరేటర్ అభ్యర్థులు అంగ ప్రశాంతి గారు, చంద్రమౌళి గారు, చంద్రకళ గారు, శివశంకర్ గారు, దేవన్ రాజు గారు, భాజపా జనసేన అభ్యర్థి ప్రకాష్ గారికి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. జనసేన నాయకులు కార్యకర్తలు సభ్యత్వ నమోదు కార్యక్రమం జయప్రదం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు.