పాయకరావుపేట, (జనస్వరం) : నక్కపల్లి మండలంలో ఉన్న బోయపాడు, రాజయ్య పేట, దొడవాక, పెద్ద తీనార్ల, చెన్న తీనార్ల మరికొన్ని గ్రామాలు, హెటిరో కంపెనీ సముద్రములోకి వదిలే రసాయన వ్యర్ద జలాల వలన పూర్తిగా వాతావరణ కాలుష్యంతో నిండి ఇక్కడున్న గ్రామాలన్నీ ఎడారిలా మారిపోతున్నాయి. మత్స్య సంపద పూర్తిగా అంతరించిపోతుంది. ఈ ప్రాంతాలలో ఉన్న మత్స్య కారులకు జీవనోపాధి కూడా లేదు. ఇలాంటి పరిస్థితుల్లో హెటిరో కంపెని యాజమాన్యం, ఇక్కడి ప్రజల ఇబ్బందులు పట్టించుకోకుండా ఇప్పటికే ఉన్న వ్యర్థ జలాల పైపు లైన్లు వాడుతూ, మరి కొన్ని క్రొత్త పైప్ లైన్లు వేయడం చాలా బాధాకరం. దీనిని మత్స్యకార గ్రామ ప్రజలు మరియు జనసేనపార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. జిల్లా కలెక్టర్ గారు నక్కపల్లి MRO గారు మరియు నక్కపల్లి పంచాయతీ సెక్రటరీ గారు ఈ విషయం గురించి హెటిరో యజమాన్యముతో సంప్రదించి ఈ పైప్ లైన్లు నిర్మాణం ఆపాలి. ప్రజల కోసం ఆలోచించి హెటిరో కంపెనీ యాజమాన్యం తక్షణమే స్పందించి క్రొత్తగా నిర్మించే ఈ వ్వర్థ జలాల పైప్ లైన్స్ ఆపాలి. లేని యెడల మత్స్యకారుల గ్రామాల కోసం జనసేన పార్టీ తీవ్రస్థాయిలో ఉద్యమం చేపడుతుందని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాము.ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, జనసైనికులు మరియు తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com