నక్కపల్లి ( జనస్వరం ) : నక్కపల్లి మండలో హెటిరో రసాయన మందుల పరిశ్రమ వ్యర్థజలాలను మూడు అడుగుల పైప్లైన్ ద్వారా సముద్రంలోకి వదలడానికి నిర్మాణం పనులు చేయుటకు వ్యతిరేకంగా 200వ రోజులనుంచి రాజయ్యపేట, పెద్దతీనార్ల మత్స్యకారుల ధర్నా చేస్తున్నారు. ఈ ధర్నాకి పాయకరావుపేట నియోజకవర్గ జనసేన పార్టీ మరియు జనసేన మత్స్యకార కమిటీ మరియు అఖిలపక్ష నాయకులు సంఘీభావం తెలిపింది. ఈ సభలో రాష్ట్ర కార్యదర్శి బోడపాటి శివదత్ మాట్లాడుతూ ప్రజల క్షేమాన్ని దృష్ఠిలో పెట్టుకోకుండా ప్రైవేట్ కంపెనీలు వ్యవహరిస్తే నిలదీయడానికి జనసేన వెనుకాడదు వేయదు అని అన్నారు. హెటిరో కంపెనీ వారు వెంటనే పైప్ లైన్లు తొలగించి అక్కడున్న మత్స్య సంపదను కాపాడాలని హెటిరో కంపెనీని శివదత్ కోరారు. ధర్నాలో పాల్గొన్న జనసేన పార్టీ మత్స్యకార వికాస విభాగ రాష్ట్ర అధ్యక్షులు బొమ్మిడి నాయకర్, మత్స్యకార వికాస విభాగ రాష్ట్ర ప్రధాకార్యదర్శి మూగి శ్రీనివాస్, రాష్ట్ర కార్యదర్శి బోడపాటి శివదత్ , మత్స్యకార కార్యవర్గ సభ్యుడు ఉమ్మిడి సంజీవరావు మరియు జనసైనికులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com