ఉదయగిరి ( జనస్వరం ) : జనసేన పార్టీ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటూ ఉదయగిరి మండల పరిధిలో పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేసిన ఉదయగిరి మండల ఉపాధ్యక్షుడు గుడిపాటి హరికృష్ణ కిడ్నీ వ్యాధి వలన మరణించడం చాలా బాధాకరం. వారి కుటుంబానికి జనసేన పార్టీ తరుపున అండగా నిలబడుతూ జనసేన పార్టీ తరుపున 25 వేల రూపాయిలు ఆర్థిక సాయం చేయడం జరిగింది. వారి కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని భరోసా కల్పించడం జరిగింది. ఉదయగిరి నియోజకవర్గ నాయకులు బోగినేని కాశీరావు గారు 10 వేల రూపాయలు, ఉదయగిరి మండల జనసేన నాయకులు సురేంద్ర రెడ్డి, చింతల శ్రీను, గాదె నరేంద్ర 15 వేల రూపాయలు ఆర్థిక సాయం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉదయగిరి నియోజకవర్గ నాయకులు భోగినేని కాశీరావు, ఉదయగిరి మండల అధ్యక్షుడు కల్లూరి సురేంద్ర రెడ్డి, జిల్లా కార్యదర్శి ఆల్లూరి రవీంద్ర, సీతారామపురం మండల అధ్యక్షుడు పాలిసెట్టి శ్రీనివాసులు, నెమళ్ళదిన్నె సర్పంచ్ తోకల రామచంద్ర, జనసేన నాయకులు పసుపులేటి తిరుపతయ్య, శ్రీను, చంద్రబాబు తదితరులు పాల్గొన్నారు.