Logo
Date of Publish : 16 November 2020, 3:23 pm
Editor : Sake Naresh

షేక్ చిన్న దస్తగిరి కుటుంబానికి ఆర్థిక సాయం : జనసేన నాయకుడు మైలేరీ మల్లయ్య

షేక్ చిన్న దస్తగిరి కుటుంబానికి ఆర్థిక సాయం : జనసేన నాయకుడు మైలేరీ మల్లయ్య

          కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలో గీతా వీధిలో నివాసముంటున్న షేక్ చిన్న దస్తగిరి కుటుంబానికి ఆళ్ళగడ్డ జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజు రూ.10,000/- ఆర్ధిక సహాయం అందిచడం జరిగిందని ఆళ్ళగడ్డ జనసేన నాయకుడు మైలేరీ మల్లయ్య తెలిపారు. మైలేరీ మల్లయ్య మాట్లాడుతూ పట్టణంలోని షేక్ చిన్న దస్తగిరి కుటుంబం గురించి తెలుసుకున్న మేము చిన్న దస్తగిరి పట్టణంలో రిక్షా నడుపుతూ జీవనం సాగించే వాడని అయితే అతనికి దాదాపు 60 సంవత్సరములు పైగా వయస్సు కలిగివున్నాడు. కానీ వయోవృద్ధుడు ఐన పింఛన్ కు అన్ని అర్హతలు ఉన్న కానీ గత అధికారుల తప్పిదంతో ఆధార్ కార్డులో వయస్సు తప్పుగా పడివుండటంతో ఆ వయోవద్ధుడైన చిన్న దస్తగిరికి పింఛన్ రాక పింఛన్ కోసం కార్యాలయం చుట్టూ ఎన్నో సార్లు అధికారుల చుట్టూ కాళ్ళు అరిగేలా తిరిగిన పింఛన్ రాక మనోవేదన ఒక వైపు అయితే కరోనా నేపధ్యంలో పనికి ఎవరూ పిలవక ఆ కుటుంబం ఒక పూట తింటూ మరో పుట ఖాళీ కడుపుతో వుంటున్నారు. అంతే కాక ఆ దంపతులకు పిల్లలు లేకపోవడంతో ఆ కుటుంబాన్ని చూసుకొనే వారే కరువయ్యారు. ఈ విషయం మాకు తెలిసి మా జనసేన పార్టీ తరపున ఆ కుటుంబానికి రూ. 10,000/- లు (నిత్యవసర సరుకులు + డబ్బులు) అందజేశాం. నిజమైన లబ్ధిదారునికి వైసిపి జగన్ ప్రభుత్వం సంక్షేమ పథకం అందిస్తున్న మాటలకు ఈ వృద్దునికి పింఛన్ అందేలా ఈ ప్రభుత్వం చూడాలని, అలాగే ఆళ్లగడ్డ ఎమ్మెల్యే కూడా చొరవ తీసుకొని చిన్న దస్తగిరి కి పింఛన్ వచ్చేలా కృషి చేయాలని ఆళ్లగడ్డ జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు ఆంజనేయులు, మహబూబ్ బాష, పసుల నరేంద్రయాదవ్, అక్బర్, రాజారామ్, చాకలి నరసింహ, శివ వెంకటసుబ్బయ్య, బాష, నరేష్, మోహన్ రెడ్డి, ఫయాజ్, మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com