సిద్దవటం ( జనస్వరం ) : మండలంలోని ఉప్పరపల్లె గ్రామానికి చెందిన పెద్దకోట్ల చంద్రయ్య (65) ఇటీవల అనారోగ్యానికి గురై బ్రెయిన్ ఆపరేషన్ చేయించుకొని మంచానికే పరిమితమయ్యాడు. ఈ విషయాన్ని రాజంపేట జనసేన పార్టీ ఇంచార్జ్ మలిశెట్టి వెంకటరమణ దృష్టికి తీసుకెళ్లగా ఆయన తక్షణమే స్పందించారు. జనసేన రాష్ట్ర చేనేత వికాస కార్యదర్శి రాటాల రామయ్య శుక్రవారం ఆ కుటుంబాన్ని పరామర్శించి రూ.10 వేలు చెక్కును అందజేసి మానవత్వాన్ని చాటుకున్నారు. జనసేన పార్టీ తరఫున అండగా ఉంటామని ఆయన భరోసా ఇచ్చారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com