ధర్మవరం ( జనస్వరం ) : శ్రీ సత్య సాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల మండలానికి చెందిన 13 మంది వలస కూలీలు కర్ణాటక రాష్ట్రంలో చిక్కబళ్లాపూర్ సమీపంలో చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో 13 మంది వలస కూలీలు దుర్మరణం పాలవడం నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని ధర్మవరం జనసేన ఇంచార్జ్ మధుసూదన్ రెడ్డి అన్నారు. వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. ప్రభుత్వం మానవతా దృక్పథంతో ఆలోచన చేసి చనిపోయిన కుటుంబాలను ఆదుకొని వెంటనే చనిపోయిన ఒక్కొక్క కుటుంబానికి 20 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించి తక్షణ సహాయంగా 5 లక్షల రూపాయలు అందజేయాలని కోరుతున్నాను. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించి 5 లక్షల రూపాయలు అందజేయాలని జనసేన పార్టీ తరపున జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి పేర్కొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com