Logo
Date of Publish : 18 August 2026, 10:26 pm
Editor : Sake Naresh

చిరంజీవి జన్మదిన సందర్భంగా చిన్నారి కేయాన్ష్‌కు ఆర్థిక సాయం

లేపాక్షి, ఆగస్టు 18 (జనస్వరం): మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని మెగా యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా శ్రీ సత్యసాయి జిల్లా లేపాక్షికి చెందిన SMA టైప్-2 వ్యాధితో బాధపడుతున్న చిన్నారి కేయాన్ష్ వైద్య ఖర్చుల కోసం రూ.10,000 ఆర్థిక సాయం అందించారు. మెగా యూత్ ఫోర్స్ రాయలసీమ కన్వీనర్ చక్రవర్తి (చక్రి) ఈ ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా చక్రవర్తి మాట్లాడుతూ, చిరంజీవి జన్మదినాన్ని కేవలం వేడుకలకు మాత్రమే పరిమితం చేయకుండా, అవసరంలో ఉన్న వారికి అండగా నిలవాలనే ఉద్దేశంతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. చిన్నారి కేయాన్ష్ వైద్యానికి తమ వంతు సహాయం అందించడం సంతోషంగా ఉందన్నారు. భవిష్యత్తులోనూ ఆపదలో ఉన్న కుటుంబాలకు, వైద్య సహాయం అవసరమైన వారికి మెగా యూత్ ఫోర్స్ తరఫున సాధ్యమైనంత మేరకు సహకారం అందిస్తామని పేర్కొన్నారు. చిన్నారి కుటుంబానికి ధైర్యం చెప్పడంతో పాటు, కేయాన్ష్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. చిరంజీవి అభిమానులు సేవా కార్యక్రమాల ద్వారా సమాజానికి తమ వంతు సహకారం అందించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో మెగా యూత్ ఫోర్స్ సభ్యులు, చిరంజీవి అభిమానులు, స్థానికులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com