ఈ రోజు హిందూపురం లోని జనసేన పార్టీ కార్యాలయంలో ఎర్రగుంట గ్రామానికి చెందిన పేద కుటుంబం కూతురు పెళ్లి నిర్వహించడానికి ఇబ్బంది పడుతుంటే హిందూపురం పట్టణ జనసేన నాయకులు మల్లెపూల మధు గారు నవ దంపతులిద్దరికి కావలసిన పెళ్లి బట్టలను, కొంత నగదును హిందూపురం జనసేన పార్టీ ఇంచార్జ్ ఆకుల ఉమేష్ గారి చేతులమీదుగా వారి కుటుంబానికి అందచేశారు. ఆకుల ఉమేష్ గారు మాట్లాడుతూ జనసేనపార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సేవా స్ఫూర్తితో ఆయన అడుగు జాడల్లో నడుస్తున్న ఎందరో యువతీ, యువకులు చాలా మంది జన సైనికులుగా మారి నిరంతరం జనసేవలో తరిస్తున్నారు. ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాల్లో మేముసైతం అంటూ ముందుంటూ అభాగ్యులపాలిట ఆపద్భాంధవులై ఆపన్నహస్తం అందిస్తూ ఎంతోమందికి ఆదర్శంగా, మార్గదర్శకులుగా విశేష సేవలందిస్తున్నారు. ఈ కార్యక్రమంలో నిమ్మకాయల రాము గారు జనసైనికులు మరియు తదితురులు పాల్గొన్నారు.