చంద్రగిరి, (జనస్వరం) : చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం దామల చెరువు గ్రామం లో ఇద్దరు యువతులు నివాసముంటున్నారు.పెద్ద యువతికి 29 సం, చిన్న యువతికి 25 సం. వారి తల్లి కొన్ని సంవత్సరాలు క్రిందట చనిపోయారు. తండ్రి 2 నెలల కిందట ఒక ఆక్సిడెంట్ లో చనిపోయారు. అప్పటి నుండి ఇద్దరు యువతలు ఎవరి తోడు లేకుండా నివాసముంటున్నారు. 5 రోజుల కిందట పెద్ద అమ్మాయి పేరు కలీమ దామలచెరువులో రోడ్డులో వెళ్తూ కళ్లు తిరిగి పడిపోతే కొంత మంది యువకులు చూసి అంబులెన్సు కు కాల్ చేసి తిరుపతి రుయాకు కు పంపించారు. అక్కడ వైద్యులు పరీక్షించగా ఆమెకు బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్ అయ్యిందని ఆపరేషన్ చేయాలని చెప్పారు. ఆపరేషన్ ఎటువంటి ఫీజు లేకుండా చేస్తామని, మెడిసిన్స్ ఖర్చులు మాత్రం ఉంటాయని చెప్పారు. కానీ తల్లి తండ్రి లేని వాళ్ళు ఎలా భరించుకోగలరు. ఈ సమస్యని దామలచెరువు జనసేన పార్టీ నాయకుల దగ్గరకు తీసుకొచ్చారు. చంద్రగిరి జనసేన పార్టీ తరపున తిరుపతి రుయాకు వెళ్లి ఆ యువతిని పరామర్శించి 26,000/- వేల రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో దామలచెరువు జనసైనికులు తదితురులు పాల్గొన్నారు.