రాజంపేట ( జనస్వరం ) : వైసీపీ నాయకులుచే బాధింపబడి ఆస్తులతో పాటు సొంత ఇంటిని సైతం కోల్పోయిన హ్యాండీక్యాప్డ్ మహిళకు రాజంపేట జనసేన పార్టీ మలిశెట్టి వెంకటరమణ సహకారంతో బుధవారం జనసేన నాయకులు ఆర్థిక సాయం చేసి చేయూతనిచ్చారు. సుండుపల్లెకు చెందిన సహీరా అనే మహిళను వైసీపీ నాయకులు మోసం చేసి ఆస్థి రాయించుకొని మరొక పునాది వేసిన ఇంటిని సైతం అక్రమంగా కబ్జా చేశారని, ఆ మహిళకు బుధవారం రూ 10 వేలు ఆర్థిక సాయం అందజేయడం జరిగిందని ఆ పార్టీ రాష్ట్ర చేనేత వికాస కార్యదర్శి రాటాల రామయ్య, సుండుపల్లి జనసేన వీర మహిళ సుగుణమ్మ, రాజంపేట జనసేన నాయకులు పోలిశెట్టి శ్రీనివాసులు, జెడ్డా శిరీష, కిషోర్ లు తెలియజేశారు. రాష్ట్రంలో వైసీపీ నాయకుల ఆరాచకాలు మితిమీరిపోయాయని, పేద, బడుగు, బలహీన వర్గాలను దోచుకు తింటున్నారని., రానున్న జనసేన-టీడీపీ ఉమ్మడి ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలను ఆదుకుంటామని ఈ సందర్భంగా వారు తెలియజేశారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com