Logo
Date of Publish : 22 July 2021, 4:23 pm
Editor : Sake Naresh

జన్యుపరమైన వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల వైద్యఖర్చులకు ఒంగోలు జనసేన నాయకుల ఆర్థిక సహాయం

        ఒంగోలు గద్దలగుంటకు చెందిన దండే వినయ్ కుమార్ కుమారులైన లాసీతా, మోక్షిత్లు చిన్నతనం నుండే జన్యుపరమైన స్పైనల్ మస్క్యులర్ ఎంట్రోఫీ వ్యాధితో బాధపడుతున్నారు. కాళ్ళనుండి నడుము వరకు చచ్చుబడి నడవలేని స్థితిలో ఉన్న  ఆ చిన్నారులకు వైద్య ఖర్చు కోట్లల్లో అవుతుందన్న వార్త కధనాలకు స్పందించిన  జనసేన పార్టీ  ప్రకాశం జిల్లా అధ్యక్షులు షేక్. రియాజ్ ఆధ్వర్యంలో వైద్య ఖర్చులు కోసం 30 వేల రూపాయలు ఆర్థిక సహకారం అందించారు. ఈ సందర్భంగా షేక్ రియాజ్ మాట్లాడుతూ ఒంగోలులో ఇద్దరు పిల్లలు ఆరోగ్య సమస్య మీద బాధ పడుతున్నారని తెలుసుకుని, పిల్లలకు వైద్య ఖర్చులకు కొంత చేయూత అందించడం జరిగిందని తెలిపారు. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ దృష్టికి ఈ చిన్నారుల సమస్యను తీసుకువెళ్లి తమ వంతు సహకారం అందిస్తామన్నారు. భారతదేశ వ్యాప్తంగా ఇలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్న వారు 450 మంది ఉన్నారు. ఈ ఇంజెక్షన్ భారతదేశంలో కూడ లేదు. ఇతర దేశం అమెరికా నుంచి తీసుకొని రావాలి . ఇలాంటి సమస్యలు ఉన్న పిల్లలకు వైద్య ఖర్చులు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకమైన బడ్జెట్ కేటాయింపు ఇచ్చి పిల్లల ప్రాణాలు కాపాడవలసిన బాధ్యత తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో షేక్ రియాజ్ తో పాటు బెల్లంకొండ సాయి బాబా, చిట్టెం ప్రసాద్, అడుసుమల్లి వెంకట్రావు, చీకటి వంశీదీపక్, కొల్లా మధు, రమేష్, కళ్యాణ్ ముత్యాల, మనోజ్, జొన్న వెంకట్ మరియు జనసైనికులు  తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com