ఒంగోలు గద్దలగుంటకు చెందిన దండే వినయ్ కుమార్ కుమారులైన లాసీతా, మోక్షిత్లు చిన్నతనం నుండే జన్యుపరమైన స్పైనల్ మస్క్యులర్ ఎంట్రోఫీ వ్యాధితో బాధపడుతున్నారు. కాళ్ళనుండి నడుము వరకు చచ్చుబడి నడవలేని స్థితిలో ఉన్న ఆ చిన్నారులకు వైద్య ఖర్చు కోట్లల్లో అవుతుందన్న వార్త కధనాలకు స్పందించిన జనసేన పార్టీ ప్రకాశం జిల్లా అధ్యక్షులు షేక్. రియాజ్ ఆధ్వర్యంలో వైద్య ఖర్చులు కోసం 30 వేల రూపాయలు ఆర్థిక సహకారం అందించారు. ఈ సందర్భంగా షేక్ రియాజ్ మాట్లాడుతూ ఒంగోలులో ఇద్దరు పిల్లలు ఆరోగ్య సమస్య మీద బాధ పడుతున్నారని తెలుసుకుని, పిల్లలకు వైద్య ఖర్చులకు కొంత చేయూత అందించడం జరిగిందని తెలిపారు. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ దృష్టికి ఈ చిన్నారుల సమస్యను తీసుకువెళ్లి తమ వంతు సహకారం అందిస్తామన్నారు. భారతదేశ వ్యాప్తంగా ఇలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్న వారు 450 మంది ఉన్నారు. ఈ ఇంజెక్షన్ భారతదేశంలో కూడ లేదు. ఇతర దేశం అమెరికా నుంచి తీసుకొని రావాలి . ఇలాంటి సమస్యలు ఉన్న పిల్లలకు వైద్య ఖర్చులు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకమైన బడ్జెట్ కేటాయింపు ఇచ్చి పిల్లల ప్రాణాలు కాపాడవలసిన బాధ్యత తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో షేక్ రియాజ్ తో పాటు బెల్లంకొండ సాయి బాబా, చిట్టెం ప్రసాద్, అడుసుమల్లి వెంకట్రావు, చీకటి వంశీదీపక్, కొల్లా మధు, రమేష్, కళ్యాణ్ ముత్యాల, మనోజ్, జొన్న వెంకట్ మరియు జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.