రాజోలులో క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న సుబ్రమణ్యంకు NRI జనసైనికుల ఆర్థిక సహాయం
రాజోలు నియోజకవర్గం లక్కవరం గ్రామంలో క్యాన్సర్ తో బాధపడుతున్న బోనం సుబ్రహ్మణ్యం అనే వ్యక్తికి ఎన్నారైలు మండేల బాబి నాయుడు మరియు వారి మిత్రులు ఓబిలి సురేష్, ధనరాజ్, పవన్, మణి, బాలాజీ, దుర్గ, మరియు వారి స్నేహితులు కలిసి అమ్మ నాన్న పవన్ కళ్యాణ్ మా దేవుడు పవర్ స్టార్ గల్ఫ్ కార్మికులు గ్రూపు ద్వారా క్యాన్సర్ తో బాధపడుతున్న బోనం సుబ్రహ్మణ్యం వ్యక్తికి గల్ఫ్ దేశాల్లో కష్టపడుతూ వాళ్ళ కష్టార్జితంలో కొంచెం కొంచెం వేసుకుని అందరూ కలిసి పవన్ కళ్యాణ్ గారి అడుగుజాడల్లో నడుస్తూ పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో 15 వేల రూపాయలు ఈ రోజున అందజేయడం జరిగింది.. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు దిరిశాల బాలాజీ ,పినిశెట్టి బుజ్జి, ఉండపల్లి అంజి, గుణి శెట్టి రామ్ జి, రే పూరి వాసు, ముత్యాల నితీష్, వంగ సతీష్, కాకర శ్రీను, చలమలశెట్టి చంటి, మేడిచర్ల కృష్ణ మూర్తి, కానూరి గాంధీ, బుల్లయ్య, నాగరాజు, దుర్గారావు, సందీప్,ప్రసాద్ మరియు జనసైనికులు పాల్గొన్నారు.. వారందరూ ఈ సహాయం చేసినటువంటి మండేల బాబి నాయుడు, ఓబిలి సురేష్ గారికి మరియు అమ్మ నాన్న పవన్ కళ్యాణ్ మా దేవుడు పవర్ స్టార్ గల్ప్ కార్మికుల గ్రూప్ సభ్యులు అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. ఎవరైనా ఆపదలో ఉంటే ఆదుకోవడానికి జనసేన ముందుంటుందని దానిని ఎన్ఆర్ఐ జనసైనికులు అమలు చేస్తున్నారంటూ రాజోలు నియోజకవర్గం జనసేన నాయకులు కొనియాడారు మరియు ఈ సాయం పొందినటువంటి బోణం సుబ్రహ్మణ్యం గారి కుటుంబ సభ్యులు మరియు గ్రామస్తులు ఎన్ఆర్ఐ జన సైనికులకు కృతజ్ఞతలు తెలియజేశారు.