జగ్గంపేట ( జనస్వరం ) : ప్రజా సమస్యల పరిష్కారం కోసం జగ్గంపేట నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన జనం కోసం జనసేన మహాయజ్ఞం 689వ రోజు కార్యక్రమంలో భాగంగా జగ్గంపేట మండలం మన్యంవారిపాలెం గ్రామంలో ఇంటింటికీ తిరుగుతున్న జగ్గంపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర. ఈ నేపథ్యంలో మన్యంవారిపాలెం గ్రామంలోని రైతులంతా కలిసి సూర్యచంద్రను వారి పొలాలలోనికి తీసుకుని వెళ్లి స్వయంగా వారి కష్టాల్ని చూపించారు ఈ సందర్భంగా సూర్యచంద్ర మాట్లాడుతూ గర్భందాల్చిన తల్లికి సరైన పోషణ అందివ్వకపోతే కడుపులో బిడ్డ ఏ విధంగా ఎదుగుదలను కోల్పోతుందో అలాగే పొట్ట దశలో ఉన్న పంటలకు సరైన సమయంలో నీరు అందివ్వకపోతే వరి కంకులు రాక పంట ఈనక పోవడమే కాక నేలంతా బీటలువారిపోయిందని జరగదని దానివల్ల రైతులు పంటలు పండక నష్టపోయారని అన్నారు. రైతులంతా ఇప్పటికే పుష్కర కాలవ ద్వారా నీరు వస్తుందని నమ్మకంతో ఇంట్లో భార్య పిల్లల నగలు తాకట్టు పెట్టి మరీ యధావిధిగా పంటలు వేసి సుమారు ఎకరానికి 50 వేల రూపాయల పెట్టుబడి పెట్టారని చెప్పారు. కానీ పుష్కర నీరు రాదు అని వారికి ముందే చెప్పి ఉంటే ఇంత నష్టం జరిగుండేది కాదు అన్నారు. కొంత కాలం క్రితం స్థానిక ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు గారు జిల్లా కలెక్టరు గారు ఎంతో ఘనంగా స్విచ్ ఆన్ చేసి ప్రారంభించిన కొంత సమయానికే పైపులు లీకై నీరు ఆగిపోయిందని చెప్పారు. అంతే కాకుండా ఈ పంట నష్టానికి కారణం ప్రభుత్వమే కాబట్టి ఎల్లుండి సోమవారం నాడు జగ్గంపేట మండల ఎమ్మార్వో ఆఫీస్ వద్ద రైతులందరితో కలిసి నష్టపోయిన రైతులకు ఎకరానికి 50 వేల రూపాయల నష్టరిహారం అందించి రైతులను ఆదుకోవాలని వినతి పత్రాలు అందివ్వడానికి వెళ్తామని, ఈ కార్యక్రమానికి రైతులు, ప్రజలు, జనసైనికులు కలిసి రావాలని జనసేన పార్టీ తరుపున పిలుపునిచ్చారు.