శ్రీకాళహస్తి ( జనస్వరం ) : జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ.పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు నచ్చి శ్రీకాళహస్తి మండలం, వాగవేడు పంచాయతీ లోని వాగవేడు, వాగవేడు హరిజనవాడ నుండి 50 మంది రైతులు ఈ రోజు జనసేనలో చేరారు. పార్టీలో చేరిన వారికి నియోజకవర్గ ఇన్చార్జి వినుత కోటా శ్రీకాళహస్తి పట్టణంలోని నియోజకవర్గ కేంద్ర పార్టీ కార్యాలయంలో కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ అన్ని పార్టీలను చూసి విసిగిపోయి, జనసేన పార్టీ పైన, పవన్ కళ్యాణ్ గారి పైన నమ్మకంతో, రైతు సౌభాగ్యాన్ని కోరే పవన్ కళ్యాణ్ గారి వల్ల రైతులకు న్యాయం జరుగుతుందని ఆశతో చేరుతున్నట్టు తెలిపారు. చనిపోయిన ప్రతి రైతుకి సొంత డబ్బులు దానం చేసే పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వేస్తే ప్రభుత్వం సొమ్ముతో రైతులను ఆదుకుంటారనే నమ్మకంతో చేరామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షుడు కావలి శివకుమార్, కార్యదర్శి ధనయ్య, పట్టణ ఇంఛార్జి తోట గణేష్, నాయకులు జనసైనికులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com