మదనపల్లి ( జనస్వరం ) : జాతీయ రైతు దినోత్సవ దినోత్సవం పురస్కరించుకొని మదనపల్లి నియోజకవర్గంలోని నిమ్మనపల్లి మండలంలో జనసేన పార్టీ నాయకులు డాక్టర్ మహేష్ గారి ఆధ్వర్యంలో రైతులతో కలిసి వ్యవసాయ భూములను సందర్శించారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి రైతులతో చర్చిస్తూ వారితో మేమేకమై వ్యవసాయం లాభసాటి కావడానికి చేసే విధి విధానాలను రైతులతో సంభాషించడం జరిగింది. అలాగే రైతులతో పాటు సహపంక్తి భోజనాలు రైతులతో పాటు వ్యవసాయ క్షేత్రంలోని భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా జనసేన పార్టీ నాయకులు మహేష్ మాట్లాడుతూ రైతులకు జగన్ మోహన్ రెడ్డి గారి నాన్న వైయస్ రాజశేఖర్ రెడ్డి ఎలాగైతే రైతు రుణమాఫీ చేశాడో, అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇప్పుడు రైతులున్న కష్ట కాలంలో రైతు రుణమాఫీ చేయాలని వాళ్ళని వాళ్ళ నాన్నని ఆదర్శంగా తీసుకొని రైతు రుణమాఫీ చేయాల్సిందిగా జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నామని అన్నారు. అలాగే ముఖ్యంగా రైతులకి గత ప్రభుత్వాలు ఇస్తున్నటువంటి సబ్సిడీ ఏదైతే డ్రిప్ ఇరిగేషన్ కోసం ఇస్తున్నటువంటి సబ్సిడీలు కూడా ఇప్పుడు ఈ ప్రభుత్వం పొందుపరిచిందోవాటిని సత్వరమే ట్రిప్ ఇరిగేషన్ సంబంధించి పూర్తి సబ్సిడీతో రైతులకు సహకరించి రైతులకు ప్రభుత్వం తరఫున తోడ్పాటు ఇవ్వాల్సిందిగా జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘ నాయకులు రామచంద్రారెడ్డి, నరసింహారెడ్డి, ఆర్జే వెంకటే,ష్ శ్రీనివాస్ రెడ్డి, జనసేన పార్టీ నాయకులు రామ్మూర్తి ఆంజనేయులు, మల్లిక, శోభ, రూప, జ్యోతి, యువ నాయకులు గంగాధర్, శ్రీనాథ్, రమణారెడ్డి, మనోజ్ విద్యార్థి నాయకులు నాగేంద్ర, హర్ష, దొబ్బిగానిపల్లి, మనీ తదితరులు పాల్గొన్నారు.