విజయనగరం, (జనస్వరం) : విజయనగరం, రైతులకు ధాన్యం, జీడీ, చెరుకు మొదలగు బకాయిలు చెల్లించండంలో ప్రభుత్వం విఫలమైందని జనసేన పార్టీ నాయకులుశ్రీ ఆదాడ మోహనరావు గారు దుయ్యబట్టారు. రైతులకు మద్దతుగా రైతులకు తక్షణమే బకాయిలు చెల్లించాలని సోమవారం ఉదయం కలెక్టరేట్ ముందు జనసేనపార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు శ్రీ దంతులూరి రామచంద్రరాజు గారు, త్యాడ రామకృష్ణారావు(బాలు), శ్రీ వంక నరసింగరావు గారు, రవిరాజ్ చౌదరి, భాస్కరరావు, జొయ్,డోల రాజేంద్రప్రసాద్ గారు, బూర్లీ వాసు గారు, లోపింటి కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.