Logo
Date of Publish : 24 July 2026, 1:13 am
Editor : Sake Naresh

రైతులు ప్రత్తి పంటకు బీమా చేయించుకోవాలి: ఏవో గాంధీ

శంఖవరం, జూలై 23 (జనస్వరం): ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో ఎల్‌నినో ప్రభావం కొనసాగుతున్నందున ప్రత్తి సాగు చేస్తున్న రైతులు, కౌలు రైతులు తప్పనిసరిగా ప్రత్తి పంటకు వాతావరణ ఆధారిత బీమా చేయించుకోవాలని వ్యవసాయ అధికారి పి. గాంధీ సూచించారు. శంఖవరం మండలంలోని మండపం, శంఖవరం, జి. కొత్తపల్లి గ్రామాల్లో రైతులతో కలిసి ప్రత్తి పంటను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఏవో గాంధీ మాట్లాడుతూ, వాతావరణ ఆధారిత పంట బీమా పథకంలో భాగంగా ప్రత్తి పంటకు బ్యాంకులో రుణం లేని రైతులు ఎకరాకు రూ.2,000 చొప్పున ప్రీమియం సొమ్మును కామన్ సర్వీస్ సెంటర్లలో చెల్లించి రసీదు పొందవచ్చని తెలిపారు. రుణం ఉన్న రైతులు సంబంధిత బ్యాంకుల్లో ప్రీమియం చెల్లించవచ్చని వివరించారు. ఈ నెల 24వ తేదీ వరకు ప్రత్తి పంట బీమా ప్రీమియం చెల్లింపులకు గడువు ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ శ్రీనివాస్, వ్యవసాయ, ఉద్యాన సహాయకులు మణికంఠ, జగదీశ్, క్రాంతి, శ్యామ్ సుందర్, రైతులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com