అనంతపురం ( జనస్వరం ) : రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి రజిని అనంతపురం పర్యటన ద్వారా అనంతపురం జిల్లాలో వైద్య సదుపాయాలు మెరుగుపడతాయని ఆశించాం, మెరుగుపడ్డాయా? మంత్రి పర్యటన ద్వారా జిల్లాకు లబ్ధి చేకూరిందా? శూన్యం. ఎప్పటిలాగే రజనీ హడావుడి, అధికారుల హడావుడి, వైసీపీ నాయకుల హడావుడి తప్ప జిల్లా ప్రజలకు ఎటువంటి ఉపయోగం లేదు. కేవలం ప్రభుత్వాసుపత్రికి సున్నం వేశారు? అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి మీరు ఎమ్మెల్యేగా గెలిచి దాదాపు నాలుగు సంవత్సరాల కాలమైంది. అనంతపురం నియోజకవర్గంలో తాగునీటి సమస్య గాని, పారిశుద్ధ సమస్య గాని, ఇటువంటి అనేకమైన సమస్యలతో పట్టణ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మీరు ఏమన్నా పరిష్కరించగలిగారా? క్లాక్ టవర్ ఫ్లైఓవర్కు నేషనల్ హైవే వారు ఇచ్చిన అలైన్మెంట్ను ఎందుకు మార్చారో చెప్పగలరా? డిప్యూటీ మేయర్ స్రవంతి మీ ఇంటి ముందర గుంతలకు మన్ను వేసి మీ వీధిలో రోడ్లను మెరుగుపరచు? మీ సందులో డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచు? తర్వాత నీవు నీ కాపు కులాన్ని ఉద్దరిద్దువు గాని? జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గురించి, జనసేన పార్టీ గురించి మాట్లాడే అర్హత, యోగ్యత నీకు లేదు అని తెలుసుకో? పర్యాటక శాఖ మంత్రి రోజా పిస్తా హౌస్ ఓపెన్ చేసి పీకల్దాకా బిరియాని తిని ఎప్పట్లాగే నోరు హద్దు అదుపు లేకుండా అధికార మదమెక్కి జనసేన పార్టీ గురించి మాట్లాడితే మేము చూస్తూ ఊరుకోం అని హెచ్చరిస్తున్నాం. అనంతపురం జిల్లాలో అకాల వర్షాలతో రైతుల పంట పొలాలు దెబ్బతిన్నాయి, కోత కోసిన కల్లాల్లో ఉన్న ధాన్యం పూర్తిగా తడిసిపోయి రైతులు నానావస్థలు పడుతున్నారు, గాలివాన వడగండ్ల వాళ్లతో ఉద్యాన పంటలు. మామిడి, అరటి లాంటి పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి కనీసం ఇద్దరు మంత్రులు జిల్లాకు విచ్చేసి రైతులు గురించి మాట్లాడిన పాపాన పోలేదంటే వైసీపీ ప్రభుత్వం రైతుల ద్రోహి ప్రభుత్వంగా మీ భావించవలసి వచ్చింది. రైతులను తక్షణమే యుద్ధ ప్రాతిపదిక పైన ఆదుకోవాలని జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నామని అనంతపురం జిల్లా జనసేన ఉపాధ్యక్షులు లాయర్ కుంటిమద్ది జయరాం రెడ్డి అన్నారు.