
ఆమదాలవలస, (జనస్వరం) : కలివరం గ్రామంలో ఆమదాలవలస జనసేనపార్టీ ఇంఛార్జి రామ్మోహన్ పర్యటించడం జరిగింది. ఈ సందర్భంగా రామ్మోహన్ మాట్లాడుతూ గత సంవత్సరం నాగావళి నది ఒడ్డున కట్టిన ఆరోగ్య కేంద్రం పునాదులు గోడలు కూలిపోవడం జరిగింది. ఆయన ఈ నాయకులుకి ఏమి పట్టనట్టు దాని పక్కనే రైతు భరోసా కేంద్రం నిర్మించడం జరిగింది. దాదాపగా 35 లక్షలు ప్రజల డబ్బులు వృధా అయ్యింది అని మండిపడ్డారు. ఇప్పుడు ఆ రైతు భరోసా కేంద్రం కూడా కోతకు గురైంది. ఇక్కడ కట్టడానికి ఎలా పర్మిషన్ ఇచ్చారు అని ప్రశ్నించారు. దీనికి కలెక్టర్, స్థానిక MLA (సభాపతి), MRO, అధికారులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే నది ఒడ్డున కరకట్టతో పాటు రాయి వేయాలని సూచించారు. లేదంటే ఎప్పటికీ అయిన ప్రమాదం జరగవచ్చు అని ఆవేదన వ్యక్తంచేశారు. కలివరం ప్రజలకి భయందోళనతో ఉన్నారు. కరకట్ట కట్టే వరకు పోరాడుతం అని మాట ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆమదాలవలస జనసేన నాయకులు రాజశేఖర్, బాల మురళి, పైడి ధనుంజయ్, గౌతం, స్థానికలు, కార్యకర్తలు, జనసైనుకులు పాల్గొన్నారు