ధర్మవరం ( జనస్వరం ) : జాతీయ రైతు దినోత్సవాన్ని పురస్కరించుకొని ధర్మవరం నియోజకవర్గం ముదిగుబ్బ మండలంలోని సిరిగారిపల్లి, సిలోళ్ళపల్లి ,దేవరగుట్టపల్లి గ్రామాల రైతులతో పర్యటిస్తూ రైతులు పడుతున్న కష్టాల గురించి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి తెలుసుకున్నారు. అనంతరం మీడియా ముఖ్యంగా మాట్లాడుతూ గ్రామాల్లోని పంట పొలాల్లోకి వెళ్ళి రైతులను, కూలీలను పలుకరించి వారి సమస్యలను, కష్టాలను తెలుసుకోవడం జరిగిందన్నారు. అక్కడి రైతుల బాధలు చెప్పడం వర్ణనాతీతమని, వైసీపీ ప్రభుత్వం వచ్చాక రైతులకు మరింత అన్యాయం జరుగుతోందన్నారు. సరైన సబ్సిడీ పథకాలు, ప్రభుత్వ ప్రోత్సాహం లభించక రైతులు క్షీణించిపోతున్నారని అలాగే గతంలో సబ్సిడీ కింద డ్రిప్ పైపులు అందించేవారని, ఇపుడు అవి కూడా అందించలేని పొలంలో పర్యటిస్తున్నప్పుడు సుంకర సుజాత తన గోడును వెల్లబోసుకుని కన్నీటి పర్యంతమైందని చిలకం మధుసూదన్ రెడ్డి ఈ ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా కమిటీ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com