
తూర్పుగోదావరి జిల్లా పోలీస్ అధికారి (SP) వారిని జనసేన పార్టీ PAC సభ్యులు పంతం నానాజీ గారి ఆధ్వర్యంలో తొండంగి మండలం కొత్తపాకల, పంబదిపేట గ్రామస్తులు, రైతులు కలిసి వినతి పత్రం అందించారు. మా వాళ్ళ పై అక్రమంగా పెట్టిన కేసులు, గ్రామాల్లో సెక్షన్ 144, 30 లను తీసివేయాలని కోరారు. దివిస్ యాజమాన్యం వారిపై తొండంగి పోలీస్ స్టేషన్ లో మేము ఇచ్చిన కంప్లైంట్ పై FIR ఫైల్ చేసి వారిని అరెస్ట్ చేయాలనీ కోరారు. కోర్ట్ స్టే ఉన్న నిర్మాణం చేస్తూనే ఉన్నవారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. దివీస్ పరిశ్రమపై జగన్ గారు ప్రతి పక్షంలో ఉన్నపుడు ఒక మాట, అధికారంలోకి వచ్చాక ఇంకొక మాట మాట్లాడుతున్నారని అన్నారు. ఇచ్చిన మాట మీద నిలబడాలని జగన్ గారికి విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో PAC సభ్యులు శ్రీ పితాని బాలకృష్ణ గారు,తెలగం శెట్టి వెనకటేశ్వరావు గారు,సంగిశెట్టి అశోక్ గారు,వాసిరెడ్డి శివగారు,చోడిశెట్టి గణేష్ గారు,అయ్యప్ప గారు,నాయుడు గారు,నాగ మానేశ్వరరావు గారు తదితరులు పాల్గొన్నారు.